Ravi Babu : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టి హింసించడం అన్యాయమని ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారో తనకు అర్థంకావడం లేదన్నారు. అధికారమనేది అశాశ్వతమని.. అలాంటి అశాశ్వతమైన అధికారంతో చంద్రబాబును జైల్లో పెట్టినవారు అదే అధికారాన్ని ఉపయోగించి చిటికెలో ఆయన్ని బయటికి తీసుకురావచ్చని అన్నారు. ఈ మేరకు రవిబాబు ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ నుంచి ఊహించిన స్థాయిలో రియాక్షన్ రాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలోనే బాబు అరెస్ట్ పై స్పందించారు. పైగా స్పందించిన వారంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబుతోనో, టీడీపీతోనో అనుబంధం ఉన్నవారు కాబట్టి తప్పలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి! ఈ నేపథ్యంలో డైరెక్టర్ రవిబాబు స్పందించారు. ఇందులో భాగంగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మాట్లాడుతూ… “జీవితంలో ఏదీ శాస్వతం కాదండీ.. సినిమా వాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుడి పవర్ కానీ ఏదీ శాస్వతం కాదు.. అలాగే చంద్రబాబుకి వచ్చిన కష్టాలు కూడా శాస్వతం కాదు” అని మొదలుపెట్టారు.
రామారావు గారి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ.. తన ఫ్యామిలీకి చాలా ఆప్తులని చెప్పిన రవిబాబు… చంద్రబాబు ఒకపనిచేసే ముందు వంద యాంగిల్స్ లో చూస్తారని.. అందరినీ సంప్రదించి, ఎవ్వరికీ ఇబ్బంది కగలకుండా డెసిషన్ తీసుకుంటారని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకి భూమిమీద ఇవాళే ఆఖరి రోజు అని తెలిసినా కూడా నెక్స్ట్ 50 సంవత్సరాల గురించి ప్లాన్స్ వేస్తారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో… చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని అన్నారు. అలాంటి మనిషిని సరైన ఆధారం లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని తెలిపారు. ఇక రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులూ అత్యంత సహజం అని చెప్పిన రవిబాబు… 73ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం అది ఏ ఎత్తో పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం అని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…