Nara Lokesh : ఏపీ స్కిల్ డివలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయం ఎంత రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో నారా లోకేష్ కూడా అరెస్ట్ కానున్నారనే ప్రచారం జరుగుతుంది.అయితే సీఐడీ నోటుసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో ఏ14గా ఉన్న లోకేశ్.. రాష్ట్రం నుంచి ఢిల్లీకి పరారయ్యారని, 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్తే.. లోకేశ్ తప్పించుకు తిరుగుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. సీఐడీ టీమ్ కి దొరక్కుండా లోకేశ్ దాగుడుమూతలు ఆడుతున్నారని, మీడియా కళ్లుగప్పి కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఐటీసీ మౌర్య నుంచి మరో చోటుకు మకాం మార్చారని, గల్లా జయదేవ్ ఇంటికి కూడా రావడం లేదని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు చేస్తున్న ఈ ఆరోపణలపై తాజాగా నారా లోకేశ్ స్పందించారు.‘‘నేను ఎక్కడికి పోలేదు. సీఐడీ వాళ్ళు ఎవరు నా దగ్గరకు రాలేదు. వాళ్ళు వస్తే నోటీస్లు తీసుకుంటా. దాక్కునే అలవాటు నాకు లేదు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే నాకేంటి సంబంధం? నేను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నా అనేది అందరికీ తెలుసు. కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని పార్టీ నేతలకి, కార్యకర్తలకు, ప్రజలకు నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తాను ఉంటున్న ప్రాంతాల అడ్రస్‌తో సహా చెప్పి కౌంటర్ ఇచ్చారు.
సీఐడీ వాళ్లు వస్తే నోటీసులు తీసుకుంటానని, తనకు దాక్కునే అలవాటు లేదని వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నాను అనేది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు నారా లోకేశ్ చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తాను ఉంటున్న ప్రాంతాల అడ్రస్ తో సహా చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు.