Nara Lokesh : నారా లోకేష్‌తో పాదయాత్ర చేసిన దేవాన్ష్.. అంద‌రి దృష్టి అత‌నిపైనే..!

Nara Lokesh : చంద్ర‌బాబు అరెస్ట్ అయిన స‌మ‌యంలో యువ‌గ‌ళానికి కొంత బ్రేక్ ఇచ్చిన నారా లోకేష్ ఇటీవ‌ల తిరిగి పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. తుని యోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో సోమవారం యువ‌గ‌ళం పాద‌యాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా పేద‌ల ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్ల ను కొనసాగిస్తామని హామీ ఇస్తూ తేటగుంట యనమల అతిధిగృహం వద్ద శిలాఫ‌ల‌కాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పాల్గొని లోకేష్‌తో కలిసి పాదయాత్రలో చేశారు.

శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మిస్తూ పాదయాత్ర సాగుతోంది. ప్రజ‌లే సైన్యంగా యువ‌గ‌ళం పాద‌యాత్ర 3000 కి.మీ. మైలురాయికి చేరింది. తుని నియోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో ఈ మ‌జిలీకి గుర్తుగా వైసీపీ స‌ర్కారు మూసేసిన పేద‌ల ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్లు మ‌ళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫ‌ల‌కం ఆవిష్కరించాను’ అని అన్నారు.

Nara Lokesh done pada yatra with mokshagna and devansh
Nara Lokesh

అయితే పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జనవరి 27న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర తొలి అడుగు పడింది. ఫిబ్రవరి 6 తేదీ 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద మార్చి 9న 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఏప్రిల్ 21న కర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద వెయ్యి కిలో మీటర్ల మైలు రాయిని లోకేష్ దాటారు. కేవలం 77వ రోజుల్లో లోకేష్ వెయ్యి కిలోమీటర్లు నడిచారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago