Bus Conductor : మ‌హిళ‌ల‌కు బ‌స్సు ఫ్రీ.. అయినా డ‌బ్బులు వ‌సూలు చేసిన కండ‌క్ట‌ర్‌.. త‌రువాత ఏమైందంటే..?

Bus Conductor : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ బర్త్‌‌డేను పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌) ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించొచ్చు అని తెలియ‌జేశారు. అయితే ఓ కండ‌క్ట‌ర్ మాత్రం మ‌హిళ‌ల‌కి టిక్కెట్లు కొట్టాడు. ఫ్రీ పథకం వచ్చింది కదా అన్నా సరే.. కోపానికొచ్చి మరీ డబ్బులు వసూలు చేశాడు. పథకం ప్రారంభించిన రెండో రోజే కండక్టర్ ఇలా చేయటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వ్య‌వ‌హారంపై సీరియస్ అయ్యారు ఎండీ సజ్జనార్. విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్‌ ను డిపో స్పేర్‌ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది’ అని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, సదరు కండక్టర్‌పై సంబంధిత డీపో మేనేజర్ సస్పెండ్ చేసినట్లు తెలిసింది. మహిళా ప్రయాణికుల నుంచి 90 రూపాయల ఛార్జీ వసూలు చేసిన‌ట్టు తెలుస్తుంది.

Bus Conductor took money from women even if it free service
Bus Conductor

మహాలక్ష్మి పథకం కింద వయసుతో సంబంధం లేకుండా మహిళలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయవచ్చని.. ఇందుకోసం కేవలం వాళ్ల దగ్గర ఏదైనా ఐడీ కార్డు ఉంటే చాలని తెలిపారు. అయితే.. పథకం ప్రారంభమైన మొదటి వారం రోజులు ఐడీ కార్డు కూడా చూపించాల్సిన పని కూడా లేదని తెలిపారు. కాగా.. కండక్టర్ ఇలా చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప‌ల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్టీసీ వ్యవస్థ ఈ పథకం ద్వారా పుంజుకుంటుందన్నారు. ఇలాంటి పథకం వల్ల అందరూ బస్సులో ప్రయాణించడానికి ముందుకు వస్తారని, దానివల్ల ప్రజా రవాణా శాతం కూడా పెరుగుతుందని చెప్పారు సజ్జనార్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago