Minister Seethakka : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త విధానాలు అమలు చేస్తూ జోరు పెంచారు. అయితే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై అప్పుడే విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో.. రైతులు వడ్లు అమ్ముకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.500 బోనస్ ఇచ్చి మరీ కొంటామని హస్తం నేతలు చెప్పారని,హరీష్ అన్నారు. మరోవైపు డిసెంబర్ 9 నుంచే రైతుబంధు డబ్బులు రూ.15 వేలు పంపిణీ చేస్తామని తెలిపినట్టు ప్రస్తావించారు. అయితే.. ఈ రెండు విషయాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని.. మాట తప్పిందని.. రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. వీటిపై రేవంత్ సర్కారు వెంటనే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనికి స్పందించిన సీతక్క.. బిఆర్ఎస్ హయంలో రైతు బంధు పథకం నిబంధనలను ఇష్టానుసారంగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పడు పెద్ద ఫౌంహౌస్ ల ఓనర్లు, మంత్రులు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. ఇది రైతు ప్రభుత్వం అన్న సీతక్క అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. మాట తప్పే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు సీతక్క.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అసలు బోనసే ఇవ్వలేదని.. సీతక్క తెలిపారు. వడ్ల కొనుగోళ్లలో రైతులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. క్వింటాల్ ధాన్యంలో సుమారు 10 కిలోలు తీసేసి.. రైతులను చాలా ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్న భూస్వాములే లబ్ది పొందారని సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేల కోట్లు అప్పులు చేసి.. పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని దర్జాగా బతికారంటూ ఆరోపించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…