Nara Bhuvaneshwari : ఏపీకి రావాలంటే పాస్‌పోర్టు, వీసా కావాలా.. జ‌గ‌న్‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన నారా భువనేశ్వరి..

Nara Bhuvaneshwari : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ అంతా రాజ‌మండ్రిలోనే ఉంటున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రావాల‌ని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవిదేశాల్లోని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిస్తున్నారు. చంద్రబాబును జైలుకు తరలించినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలోనే ఉంటూ ప్రార్ధ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా చంద్రబాబు అర్ధాంగి బుధవారం చర్చికి వెళ్లారు. రాజమండ్రి జాంపేటలోని సెయింట్‌ పాల్స్‌ లూథరన్‌ చర్చిలో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్యాండిల్స్ వెలిగించి చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుకున్నారు. నారా భువనేశ్వరి రాక నేపథ్యంలో లూథరన్ చర్చిలో ఫాస్టర్లు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరితో పాటు ఆమె సన్నిహితులు, పలువురు నేతలు పాల్గొన్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను కూడా అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు. కార్యకర్తలు తమ బిడ్డలతో సమానం.. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని.. జైలుకు వెళ్తున్నారని బాధ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్నా.. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.

Nara Bhuvaneshwari very angry comments on cm ys jagan
Nara Bhuvaneshwari

తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం.. ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదన్నారు. తానే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నానని, ఆ సంస్థలో 2 శాతం వాటా అమ్మినా రూ. 400 కోట్లు వస్తాయని చెప్పారు. ఇక ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఏం తప్పు చేశారని ఆయనను జైల్లో పెట్టారని ప్రశ్నించారు ఆమె. ఇక హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా? అని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago