Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు అరెస్ట్ తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజలలోకి వెళుతూ వైసీపీ గురించి, వారి వ్యవహార శైలి గురించి వివరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిజం గెలవాలి కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడటం జరిగింది. తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం భువనేశ్వరి ప్రసంగించారు.”మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్వామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని… కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం (భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్) నాలుగు దిక్కులయ్యాం.
చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయింది. మనవడు దేవాన్ష్ ను చూసి 48 రోజులు అయింది” అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు వచ్చిన మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ల ద్వారా 2019లోనూ ఏపీ ప్రభుత్వం అవార్డు అందుకుంది. 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో అవినీతి జరిగిందని చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు? అని అనిత ప్రశ్నించగా, దానికి స్పందించిన భువనేశ్వరి.. తప్పుడు కేసులు పెట్టి టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు. రూ.371 కోట్లు అవినీతి అంటున్నారు. అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో చెప్పడం లేదు. 48 రోజులుగా చంద్రబాబును నిర్బంధించారు. ఇలా ఇబ్బందులకు గురి చేస్తే పెట్టుబడిదారులెవరూ రాష్ట్రానికి రారు… పరిశ్రమలు పెట్టరు. సీఐడీ అధికారులు విచారణ చేసుకోండి… ఇలాంటి వాటికి టీడీపీ బెదరదు అని అన్నారు.
తన భర్త నుంచి తాను ఓర్పు నేర్చుకున్నట్లు భువనేశ్వరి స్పష్టం చేశారు.ఈ ముఖాముఖి కార్యక్రమంలో జనసేన మహిళ నేత పవన్ మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ కలిసి బాగున్నారా అమ్మ అని ఆప్యాయంగా అడిగారు.ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల గురించి చెప్పి తాను కూడా బాధపడటం జరిగింది.ఆయన కూడా రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు.కచ్చితంగా మా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…