ICC World Cup 2023 : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్,సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ ప్రపంచకప్‌కే హైలెట్ అనదగ్గ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగింది. విజయం కోసం పాకిస్థాన్, సౌతాఫ్రికా కొదమసింహాల్లా హోరాహోరీగా తలపడిన మ్యాచ్‌లో గెలుపు చివరకు సఫారీలనే వరించింది. వికెట్ తేడాతో పాకిస్థాన్ మీద విజయం సాధించింది. . చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పాకిస్థాన్‍తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు ఒక వికెట్ తేడాతో విజయం సాధించారు. పాకిస్థాన్ నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలోనూ సౌతాఫ్రికా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
అయితే నిన్న జరిగిన మ్యాచ్ పాకిస్తాన్‌కు డు ఆర్ డై మ్యాచ్ . ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరడానికి కొద్దో, గొప్పో అవకాశాలు ఉండేవి. కాని ఇప్పుడు ఆ మ్యాచ్ ఓడిపోవడంతో ఇక సెమీస్‌కి చేరడం కష్టంగానే మారింది. అయితే సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపించింది. దక్షిణాఫ్రికా బౌలర్లను రెచ్చగొట్టింది. వారితో స్లెడ్జింగ్‌కు దిగింది ఫలితంగా- బౌలర్ల రిథమ్, ఏకాగ్రతను దెబ్బతీయాలనేది పాకిస్తాన్ గేమ్ ప్లాన్. గతి తప్పి బంతులను సంధిస్తే- వాటిని బౌండరీలు మలచాలనేది పాకిస్తాన్ వ్యూహం కావొచ్చు. మార్కో జన్‌సెన్‌తో వాగ్వివాదానికి దిగాడు మహ్మద్ రిజ్వాన్.
పాకిస్తాన్ ఓపెనర్లను పెవిలియన్ దారి పట్టించిన బౌలర్ అతను. నిప్పు కణికల్లాంటి బంతులను సంధిస్తోన్న జన్‌సెన్‌తో అకారణంగా వాగ్వివాదానికి దిగాడు రిజ్వాన్. అతని రిథమ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. తన తొలి అయిదు ఓవర్లల్లో 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు జన్‌సెన్. ఇందులో ఒకటి మెయిడెన్ కూడా. అందుకే- అతన్ని టార్గెట్ చేశాడు రిజ్వాన్. వాగ్వివాదానికి దిగాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య వాడివేడిగా వాగ్వివాదం కొనసాగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ జోక్యం చేసుకోవడంతో రిజ్వాన్ వెనుదిరిగాడు. మొత్తానికి థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో పాక్ ఓటమి చెందడి ఆ దేశ అభిమానులకి ఏ మాత్రం మింగుడుపడడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…