Delhi Lock Down : లాక్ డౌన్..ఈ పేరు గతంలో ఎప్పుడు వినిపించలేదు. ఎప్పుడైతే కరోనా విజృంభణ మొదలైందో అప్పటి నుండి లాక్‌డౌన్ పేరు ఎక్కువగా వినిపించింది.కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరాడక విలవిల్లాడిపోతున్నారు. దీంతో అధికారులు ఢిల్లీలో లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హస్తినలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమయ్య మాత్రం తీరడం లేదు. నేడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచీలో గాలి నాణ్యతను పరిశీలించగా 273గా నమోదైంది. గాలి నాణ్యత అత్యంత పేలవంగా మారడంతో ప్రజలు ఊపిరాడక తల్లడిల్లారు.
ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తున్న నేపథ్యంలో ఢిల్లీ విశ్వ విద్యాలయం, న్యూ ఢిల్లీలోని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత కలుషితంగా మారిపోయింది.ఆయా ప్రాంతాల్లో ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచీ) 273,173 గా నమోదైంది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్వాస సంబంధిత వ్యాధుల భారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దసరా పండగ పురస్కరించుకుని బాణాసంచా కాల్చడంతో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది.ఓ వైపు పొగమంచు మరోవైపు బాణాసంచా కాల్చడం వల్ల ఏర్పడిన పొగతో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దారుణంగా పడిపోయే అవకాశం ఉందని ఢిల్లీకి కేంద్రం ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టం వెల్లడించింది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 ఏక్యూఐ నాణ్యత మంచిగా ఉందని తెలియజేస్తుంది. 51 నుంచి 100 సంతృప్తికరంగా, 101 నుంచి 200 మధ్యస్థంగా, 201 నుంచి 300 వరకు పేలవంగా, 301 నుంచి 400 వరకు చాలా పేలవంగా, 401 నుంచి 500 వరకు తీవ్రంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. కాగా రాజధాని నగరంలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వాడకంపై సమగ్ర నిషేధాన్ని విదించింది ప్రభుత్వం. నవంబర్ 1 నుంచి ఢిల్లీలో డీజిల్ తో నడిచే బస్సులను సైతం నిషేదిస్తున్నట్లు తెలిపారు.అయితే రాను రాను పరిస్థితి దారుణంగా మారుతున్న నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…