Dasara Movie Review : నాని న‌టించిన ద‌స‌రా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

Dasara Movie Review : ఎన్ని ఫ్లాపులు చ‌వి చూసిన కూడా ప్ర‌యోగాలు చేస్తూనే ఉంటాడు నేచుర‌ల్ స్టార్ నాని. త‌న‌దైన పంధాలో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉండే నాని ఈసారి డీగ్లామర్ లుక్ లో.. అచ్చమైన తెలంగాణ నాటు కుర్రాడిగా నటించాడు. శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్… దసరా సినిమాతో సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మ‌రి భారీ అంచ‌నాల‌తో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా క‌థ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌: చిత్రంలో ధరణి (నాని) సింగరేణి బొగ్గుగని కార్మికుడు. అన్యాయాన్ని అస‌లు సహించడు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు, అడ్డొస్తే లేపేయ‌డం ఆయ‌న స్పెషాలిటి. సింగరేణిలో ఓ కాంట్రాక్టర్ చేసే అన్యాయానికి ఎదురు తిరిగి భీకరంగా పోరాడి త‌న స్నేహితుడిని, ప్రియురాలిని కాపాడుకుంటాడు. ఇది కాస్త రొటీన్ కథే అయినా కథనం, సన్నివేశాలు, నాని నటన అదిరిపోయాయి. అయితే ఇందులో నాని రాత్రి చేసిన ప‌నులు పొద్దున గుర్తుండ‌వు. అలా ఒకరోజు అనుకోకుండా చిన్న నంబి ( షైన్ టామ్ చాకో ) యొక్క సిల్క్ బార్ లో గోడ‌వ పడి మర్చిపోతాడు, అయితే చిన్న నంబి మాత్రం దాన్ని అంత తేలిగ్గా మర్చిపోడు, దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎలా సాల్వ్ చేశాడ‌నేదే చిత్ర‌క‌థ‌.

nani Dasara Movie Review how is it
Dasara Movie Review

చిత్రంలో నాని పక్కా మాస్ లుక్స్‌తో తెరను చించేశాడు. వెన్నెలగా నటించిన కీర్తి సురేశ్, విలన్‌గా చేసిన మలయాళ నటుడు షైన్ చాకో పాత్రల్లో జీవించారు. వెన్నెలాంటి ప్రేయసి మనకూ ఉండాలి, చాకో లాంటి విలన్‌తో మనమూ కొట్టాడాలని ప్రేక్షకులు అనుకునేలా చిత్రం ఉంది . ధరణికి స్నేహితుడిగా నటించిన కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టికి కూడా మంచి మార్కులే పడ్డాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ అందించింది. సత్యన్ సూర్యన్, సంగీతం సంతోష్ నారాయణన్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఎస్ఎల్ వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరి సాంకేతిక విలువ‌లు కూడా బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమా మంచి ఎమోష‌న‌ల్ మూవీ అని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago