Samantha : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాయి. పుష్ప మువీలో సమంత ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావ ఉఊ.. అంటావా మావా’ అభిమానులను ఓ ఊపు ఊపేసిందంటే అతిశయోక్తికాదు. పుష్ప సినిమా సీక్వెల్‌గా పుష్ప-2లోనూ సమంతతో ఓ ఐటం సాంగ్ కోసం చిత్రబృందం సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని చిత్రంలోని కొందరు క్లారిటీ ఇచ్చారు.
అయితే సమంత తను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకి సంబంధించిన అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చింది. పుష్పలోని ఐటెం సాంగ్ వల్లనే తనకు విడాకులు ఇచ్చారని కొందరు చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన సమంత.. విడాకులు తీసుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ ఆఫర్ ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావ’ సాంగ్. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే నేను ఇంట్లో ఎందుకు కూర్చోవాలని, ఈ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. నా సన్నిహితులు, స్నేహితులు అయితే విడాకులు తీసుకున్న వెంటనే ఈ ఐటం సాంగ్ ఎలా ఒప్పుకుంటావ్ అని అన్నారు.
సినిమాలు వద్దు ఏమీ వద్దు, ఇంట్లో కూర్చో అని కొందరు చెప్పారు. దీంతో ఎవరు ఏం చెప్పినా సరే పట్టించుకోవడం మానేసి పలు ఆసక్తికర సినిమాలు చేస్తూ వెళ్లాను అని సమంత స్పష్టం చేశారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చేసిన ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు సమంత. చెప్పాలంటే కెరీర్ మొత్తంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా మరో ఎత్తు. ఆ ఒక్క పాటతో ఆమెకు సూపర్ క్రేజ్ వచ్చింది. కాగా సమంత ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ కథలని ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…