Dasara Movie Review : ఎన్ని ఫ్లాపులు చవి చూసిన కూడా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు నేచురల్ స్టార్ నాని. తనదైన పంధాలో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే నాని ఈసారి డీగ్లామర్ లుక్ లో.. అచ్చమైన తెలంగాణ నాటు కుర్రాడిగా నటించాడు. శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్… దసరా సినిమాతో సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి భారీ అంచనాలతో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.
కథ: చిత్రంలో ధరణి (నాని) సింగరేణి బొగ్గుగని కార్మికుడు. అన్యాయాన్ని అసలు సహించడు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు, అడ్డొస్తే లేపేయడం ఆయన స్పెషాలిటి. సింగరేణిలో ఓ కాంట్రాక్టర్ చేసే అన్యాయానికి ఎదురు తిరిగి భీకరంగా పోరాడి తన స్నేహితుడిని, ప్రియురాలిని కాపాడుకుంటాడు. ఇది కాస్త రొటీన్ కథే అయినా కథనం, సన్నివేశాలు, నాని నటన అదిరిపోయాయి. అయితే ఇందులో నాని రాత్రి చేసిన పనులు పొద్దున గుర్తుండవు. అలా ఒకరోజు అనుకోకుండా చిన్న నంబి ( షైన్ టామ్ చాకో ) యొక్క సిల్క్ బార్ లో గోడవ పడి మర్చిపోతాడు, అయితే చిన్న నంబి మాత్రం దాన్ని అంత తేలిగ్గా మర్చిపోడు, దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎలా సాల్వ్ చేశాడనేదే చిత్రకథ.
చిత్రంలో నాని పక్కా మాస్ లుక్స్‌తో తెరను చించేశాడు. వెన్నెలగా నటించిన కీర్తి సురేశ్, విలన్‌గా చేసిన మలయాళ నటుడు షైన్ చాకో పాత్రల్లో జీవించారు. వెన్నెలాంటి ప్రేయసి మనకూ ఉండాలి, చాకో లాంటి విలన్‌తో మనమూ కొట్టాడాలని ప్రేక్షకులు అనుకునేలా చిత్రం ఉంది . ధరణికి స్నేహితుడిగా నటించిన కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టికి కూడా మంచి మార్కులే పడ్డాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ అందించింది. సత్యన్ సూర్యన్, సంగీతం సంతోష్ నారాయణన్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఎస్ఎల్ వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరి సాంకేతిక విలువలు కూడా బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమా మంచి ఎమోషనల్ మూవీ అని చెప్పాలి.