Nalini : జాత‌కం బాగాలేద‌ని చెప్పి ఆ న‌టిని భ‌ర్త వదిలేశాడా..?

Nalini : ముహూర్తాలు, జాతకాలను మూడ నమ్మకాలని చాలా మంది పాటిస్తారు, కొంద‌రు కొట్టిపారేస్తారు. అయితే ఈ జాతకాలు కొంద‌రి జీవితాలనే తలక్రిందులు చేసిన సంఘటనలు కొకొల్లలు. జాతకాలను నమ్మే వారి వల్ల అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణే అలనాటి హీరోయిన్ నళిని జీవితం. న‌ళిని అంటే టక్కున గుర్తుకు రాకపోవ‌చ్చు కాని … ‘‘అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనే’’ అనే ఓల్డ్ సింగ్ చూస్తే నళిని ఎవరో తెలుస్తోంది. సంఘర్షణ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా కూడా నటించింది. ఈమె అసలు పేరు రాణి కాగా, ఈమె తండ్రి వై. కే.మూర్తి సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా పని చేశారు.

ఇప్పటితరానికి న‌ళినిని గుర్తుచేయాలంటే కిక్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ మథర్ అని చెప్పాలి.అయితే గతంలో ఈమె తన అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది బాలనటిగా పలు సినిమాల్లో నటించిన నళిని ఆ తర్వాత టీ.రాజేంద్ర దర్శకత్వంలో నటించిన ‘‘ప్రేమ సాగరం’’ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమె భర్త రామరాజన్ కు కోలీవుడ్ లో మంచి పేరుంది.

Nalini husband left her because of her astrology
Nalini

ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్న రోజుల్లోనే నళినిపై మనసు పడి, మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఏకంగా నళిని తల్లితో చెప్పడంతో ఆమె అతనిని చావబాదారట. ఈ ఘటన తర్వాత తమిళ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళ సినిమాలకే ఓకే చెప్పారట నళిని తల్లి. అయితే ఆ తర్వాత నటి జీవిత సాయంతో నళిని – రామరాజన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవలలు కాగా, జాతకాలను నమ్మే అలవాటున్న రాజరాజన్.. వారి పిల్లల జాతకాల రీత్యా హాస్టల్ లో ఉంచుదాం అంటూ భార్య నళినితో అన్నారట. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లు దూరంగా వున్నారు. అయితే పిల్లల పెళ్లి సమయంలో మాత్రం నళిని, రామరాజన్ లు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు నిర్వర్తించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago