Chiranjeevi : హాలీవుడ్ సినిమా చేయాల‌ని అనుకున్న చిరు.. మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందంటే..?

Chiranjeevi : స్వ‌యంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చిన చిరంజీవి మెగాస్టార్‌గా ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆయ‌న అప్ప‌టి త‌రానికే కాదు ఈ త‌రానికి కూడా ఫేవ‌రేట్ హీరోనే. చిరంజీవి సినిమా వ‌స్తుందంటే థియేట‌ర్స్ క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. సౌత్ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసిన చిరంజీవి హిందీలో కూడా న‌టించారు. అయితే హాలీవుడ్ రేంజ్‌లో తెలుగు సినిమా చేయాల‌ని చిరంజీవికి ఓ కోరిక ఉండేద‌ట‌. అప్పట్లోనే అలాంటి సినిమా కోసం ప్రయత్నించారు. ఆ సినిమానే అబూ బగ్దాద్ గజదొంగ.

అమెరికాలో స్థిర‌ప‌డిన‌ ముగ్గురు భారతీయులు చిరంజీవితో 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్ ను కూడా రంగంలోకి దింపాలని అనుకున్నారు. ఇక సంగీత ద‌ర్శ‌కుడిగా ఏఆర్ రెహమాన్ ను అనుకున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌లో ఒక మతంవారిని కించపరిచినట్టుగా బ‌య‌ట‌కు లీక్ అయ్యిందట. దాంతో ఆ మతానికి చెందినవారు సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. అలా మెగాస్టార్ కలలు కన్నా కూడా హాలీవుడ్ ఎంట్రీ కి చెక్ ప‌డింది.

chiranjeevi tried to do hollywood movie why stopped
chiranjeevi

అయితే చిరంజీవి సినిమాలు హాలీవుడ్ రేంజ్‌కి వెళ్ల‌క‌పోయిన కూడా సౌత్ సినిమాలు మాత్రం ఆ రేంజ్ ని అందుకున్నాయి. బాహుబ‌లి., కేజీఎఫ్‌, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హాలీవుడ్ ప్ర‌ముఖుల దృష్టిని ఆకర్షించిన విష‌యం తెలిసిందే. ఇక చిరు మ‌ధ్య‌లో రాజ‌కీయాల‌లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. 9 ఏళ్ల పాటు రాజ‌కీయాల‌లో ఉండి మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చారు. ఇదిలా ఉంటే చిరు తాజాగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పైనా తన మనసులో మాటను వెల్లడించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడంపైనా స్పందించారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగడానికి అవసరమైన శక్తియుక్తుల గురించి చిరంజీవి తన ప్రసంగంలో ప్రస్తావించారు. పూర్వ మిత్రుల సమ్మేళనంలో చిరంజీవి మాట్లాడారు. సున్నిత మనస్కులకు రాజకీయాలు సరిపోవని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలంటే సెన్సిటివ్‌గా ఉండకూడదని పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago