Chiranjeevi : స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి మెగాస్టార్‌గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన అప్పటి తరానికే కాదు ఈ తరానికి కూడా ఫేవరేట్ హీరోనే. చిరంజీవి సినిమా వస్తుందంటే థియేటర్స్ కళకళలాడుతుంటాయి. సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన చిరంజీవి హిందీలో కూడా నటించారు. అయితే హాలీవుడ్ రేంజ్‌లో తెలుగు సినిమా చేయాలని చిరంజీవికి ఓ కోరిక ఉండేదట. అప్పట్లోనే అలాంటి సినిమా కోసం ప్రయత్నించారు. ఆ సినిమానే అబూ బగ్దాద్ గజదొంగ.
అమెరికాలో స్థిరపడిన ముగ్గురు భారతీయులు చిరంజీవితో 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్ ను కూడా రంగంలోకి దింపాలని అనుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను అనుకున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌లో ఒక మతంవారిని కించపరిచినట్టుగా బయటకు లీక్ అయ్యిందట. దాంతో ఆ మతానికి చెందినవారు సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. అలా మెగాస్టార్ కలలు కన్నా కూడా హాలీవుడ్ ఎంట్రీ కి చెక్ పడింది.
అయితే చిరంజీవి సినిమాలు హాలీవుడ్ రేంజ్‌కి వెళ్లకపోయిన కూడా సౌత్ సినిమాలు మాత్రం ఆ రేంజ్ ని అందుకున్నాయి. బాహుబలి., కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక చిరు మధ్యలో రాజకీయాలలోకి వెళ్లిన విషయం తెలిసిందే. 9 ఏళ్ల పాటు రాజకీయాలలో ఉండి మళ్లీ సినిమాలలోకి వచ్చారు. ఇదిలా ఉంటే చిరు తాజాగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పైనా తన మనసులో మాటను వెల్లడించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడంపైనా స్పందించారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగడానికి అవసరమైన శక్తియుక్తుల గురించి చిరంజీవి తన ప్రసంగంలో ప్రస్తావించారు. పూర్వ మిత్రుల సమ్మేళనంలో చిరంజీవి మాట్లాడారు. సున్నిత మనస్కులకు రాజకీయాలు సరిపోవని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలంటే సెన్సిటివ్‌గా ఉండకూడదని పేర్కొన్నారు.