Sr NTR : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగాడు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యాడు. మనం ఎవరం రాముడు, కృష్ణుడిని చూడలేదు కానీ రామరావులో దేవుడిని చూసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. దానవీర శూరకర్ణలో 3 పాత్రలు, 5 విభాగాల్లో పని చేసి అందరిని అలరించారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఎన్టీ రామారావు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్టీ రామారావు చేసిన విభిన్నమైన సినిమాల్లో యమగోల సినిమా ఒకటి.
1977వ సంవత్సరంలో తాపీనేని రామారావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాను బెంగాలీలో తెరకెక్కిన యమాలయే మానుష్ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీరామారావు హీరోగా నటించగా యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ నటించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో బాలకృష్ణను హీరోగా అనుకున్నారు. అంతేకాకుండా కైకాల సత్యనారాయణ చేసిన పాత్రలో ఎన్టీ రామారావు నటించాల్సి ఉంది. కానీ అప్పటికే ఎన్టీరామారావు యముడి పాత్రలో దేవాంతకుడు అనే సినిమా వచ్చింది.
ఈ సినిమాకు పుల్లయ్య దర్శకత్వం వహించారు. దేవాంతకుడు సినిమాలో ఎన్టీఆర్ హీరోగా చేయడం వల్ల యమగోల కూడా అదే టైప్ సినిమా కాబట్టి బాలకృష్ణను హీరోగా పెట్టి తీయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కు బాలకృష్ణ సొంత బ్యానర్ లో తప్ప ఇతర బ్యానర్ లలో సినిమాలు చేయడం ఇష్టం లేదు. ఈ ఒక్క కారణం వల్లే ఎన్టీఆర్ బాలకృష్ణను యమగోల ప్రాజెక్ట్ నుండి తప్పించారు. అంతేకాకుండా నటుడు కైకాల సత్యనారాయణను యముడి పాత్రలో తీసుకోవాలని కూడా ఎన్టీఆర్ గారే సూచించారు. ఇక అలా బాలకృష్ణ హీరోగా చేయాల్సిన యమగోల సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…