Nalini : ముహూర్తాలు, జాతకాలను మూడ నమ్మకాలని చాలా మంది పాటిస్తారు, కొందరు కొట్టిపారేస్తారు. అయితే ఈ జాతకాలు కొందరి జీవితాలనే తలక్రిందులు చేసిన సంఘటనలు కొకొల్లలు. జాతకాలను నమ్మే వారి వల్ల అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణే అలనాటి హీరోయిన్ నళిని జీవితం. నళిని అంటే టక్కున గుర్తుకు రాకపోవచ్చు కాని … ‘‘అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనే’’ అనే ఓల్డ్ సింగ్ చూస్తే నళిని ఎవరో తెలుస్తోంది. సంఘర్షణ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా కూడా నటించింది. ఈమె అసలు పేరు రాణి కాగా, ఈమె తండ్రి వై. కే.మూర్తి సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా పని చేశారు.
ఇప్పటితరానికి నళినిని గుర్తుచేయాలంటే కిక్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ మథర్ అని చెప్పాలి.అయితే గతంలో ఈమె తన అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది బాలనటిగా పలు సినిమాల్లో నటించిన నళిని ఆ తర్వాత టీ.రాజేంద్ర దర్శకత్వంలో నటించిన ‘‘ప్రేమ సాగరం’’ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమె భర్త రామరాజన్ కు కోలీవుడ్ లో మంచి పేరుంది.
ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్న రోజుల్లోనే నళినిపై మనసు పడి, మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఏకంగా నళిని తల్లితో చెప్పడంతో ఆమె అతనిని చావబాదారట. ఈ ఘటన తర్వాత తమిళ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళ సినిమాలకే ఓకే చెప్పారట నళిని తల్లి. అయితే ఆ తర్వాత నటి జీవిత సాయంతో నళిని – రామరాజన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవలలు కాగా, జాతకాలను నమ్మే అలవాటున్న రాజరాజన్.. వారి పిల్లల జాతకాల రీత్యా హాస్టల్ లో ఉంచుదాం అంటూ భార్య నళినితో అన్నారట. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లు దూరంగా వున్నారు. అయితే పిల్లల పెళ్లి సమయంలో మాత్రం నళిని, రామరాజన్ లు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు నిర్వర్తించారు.