Sridevi : శ్రీదేవి సినీ వినీలాకాశంలో ఓ ధృవతార. నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన అరుదైన నటీమణి. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడిచి బాలీవుడ్‌లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. అతిలోక సుందరి అన్నా, వెన్నెల బొమ్మ అన్నా.. తరాలు మారినా తరగని అందం అన్నా.. అది ఆమెకే చెల్లుతుంది. అందుకే శ్రీదేవి పేరు వినగానే అభిమానుల గుండెల్లో గులాబీలు పూస్తాయి. ఆమె కళ్లతో చిలిపిగా ఓ నవ్వు నవ్వితే ప్రేక్షకులు మైమరచిపోతారు. మూడుతరాల హీరోల సరసన హీరోయిన్ గా అలరించిన అందం శ్రీదేవి.
సౌత్ లో ఎంతో పాపులర్ అయిన తర్వాత శ్రీదేవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా వరుస హిట్లు పడటంతో శ్రీదేవి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారారు. ఇక బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి హీరో మిథున్ చక్రవర్తితోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ అప్పటికే మిథున్ చక్రవర్తికి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి మిథున్ చక్రవర్తి విషయం తెలిసి ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో మిథున్ శ్రీదేవిని దూరం పెట్టేశాడు. ఆ తర్వాత బోనీకపూర్ శ్రీదేవి హీరోయిన్ గా అనేక చిత్రాలు నిర్మించాడు.
ఆ సమయంలో శ్రీదేవిని బోనీ కపూర్ ఓదార్చేవాడు. అలా శ్రీదేవి బోనికపూర్ మధ్య స్నేహం చిగురించింది. కానీ అలాంటి సమయంలోనే అనుమానం వచ్చిన మిథున్ చక్రవర్తి.. శ్రీదేవి లైఫ్ లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా బోనీ కపూర్ కు రాఖీ కట్టాలని శ్రీదేవికి ఆర్డర్ వేసాడు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పినా వినకుండా మిథున్ చక్రవర్తి శ్రీదేవితో బోణీకపూర్ కు రాఖీ కట్టించాడు. ఆ తర్వాత మిథున్ చక్రవర్తి చేసిన మోసాన్ని గుర్తించిన శ్రీదేవి అతడికి పూర్తిగా దూరం అయింది. కొంతకాలం ప్రేమలో మునిగితేలిన శ్రీదేవి బోణీకపూర్ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…