Anitha Chowdary : కొంతమంది హీరోయిన్ లు ఎంతో అందంగా ఉన్నా, టాలెంట్ ఉన్నా, అదృష్టం లేక స్టార్డమ్ ను సంపాదించలేక పోతున్న వారిలో అనితా చౌదరి కూడా ఒకరు. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించినా, తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయింది. చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే తన కెరీర్ ని మొదలు పెట్టిన అనితా చౌదరి, ఈటీవీ,జెమినీ టీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో యాంకర్ గా నటించింది. ఇక ఆ తర్వాత వెండితెరపై సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. సంతోషం, మురారి , ఉయ్యాలా జంపాలా వంటి మరి కొన్ని సినిమాలలో నటించింది అనిత. ఇలా బుల్లితెరపై, వెండితెర పై తనకంటూ ఒక స్థానాన్ని అలాగే గుర్తింపు కూడా తెచ్చుకున్నది.
1997లో శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తాళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా యాంకరింగ్ మీద మక్కువతో ఆ సినిమా ఛాన్స్ వదులుకుంది అనితా. అనంతరం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన రాజా సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఈ మె ఆ తర్వాత అనేక అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఆక్వా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడంతో ఐదేళ్ల వయస్సులో కోల్‌కతా నుండి హైదరాబాద్ వచ్చేసింది.
ఇక అనితా చౌదరికి ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క ఉండగా, ఆమెకు త్వరగానే పెళ్లి చేశారు. ఇక ఇంటి బాధ్యలని చాన్నాళ్లు మోసింది అనితా. ఇక హీరో శ్రీకాంత్ కజిన్ అయిన కృష్ణ చైతన్యను 2005 జూన్ 18న ప్రేమ వివాహం చేసుకున్నారు అనితా. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ లో ఛానల్ మెయింటెయిన్ చేస్తున్నారు. మంచి సందేశాన్ని ఇచ్చే వీడియోలు చేస్తుంటారు. ఒక చారిటీ సంస్థ ద్వారా ఎంతో మందికి చేయూత నిస్తుంది. ఇక తనకు నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయిన చేస్తానని తాజాగా చెప్పుకొచ్చింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…