Sr NTR And Jr NTR : తెలుగు చిత్రసీమలో నందమూరి తారకరామారావు చెరగని ముద్ర వేసుకున్నారు. విలక్షణమైన తన నటనతో ఎన్టీరామారావు నట విశ్వరూపరాన్ని ప్రదర్శించారు. ఇక నందమూరి ఫ్యామిలీలో ఎన్టీరామారావు తరవాత ఆయన నట ప్రస్థానాన్ని బాలకృష్ణ కొనసాగించారు. బాలయ్య తరవాత మళ్లీ అంతటి క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చింది. ఎన్టీఆర్ పోలికలు తాతలా ఉండటం.. నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకోవడంతో బాలయ్య కంటే ఎన్టీఆర్ కు ఎక్కువే క్రేజ్ ఉంది. అన్నగారు ఎన్టీ రామారావు చాలా మొండివారని ఆయన సన్నిహితులు, ఆయనతో కలిసి సినిమాలు చేసిన వారు ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు.
ఇక తాతగారి రూపురేఖలతో జన్మించిన జూనియర్ ఎన్టీఆర్ కు తాతగారి ఆ మొండితనం కూడా వచ్చిందని అంటూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన పరుచూరి పలుకులు కార్యక్రమంలో బయటపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆది సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ను షూట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి ఒక క్లాసు తగిలి గాయం అయ్యిందట.
దీంతో పరుచూరి గోపాలకృష్ణ గారు వివి వినాయక్ ను షూటింగ్ అపేసారా అని ప్రశ్నించగా.. లేదు సార్ తారక్ షూటింగ్ కంటిన్యూ చేద్దాం అని చెప్పారు అని అన్నారట. ఆ సమయంలో పరుచూరి కి సీనియర్ ఎన్టీఆర్ మొండితనం గుర్తుకు వచ్చిందట. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్.టి.రామారావు చేతికి కూడా గాయం తగిలి రక్తం కారిందట.. అయినప్పటికీ అన్నగారు ఈ మాత్రం దానికే షూటింగ్ ఆపడం ఏంటి అంటూ షూటింగ్ కంటిన్యూ చేశారట. ఇక సర్దార్ పాపారాయుడు సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ఆది కూడా అంతే బ్లాక్ బస్టర్ గా నిలిచిందని పరుచూరి అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…