Nagarjuna : టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఎవరి స్టైల్‌లో వారు తమదైన సినిమాలు చేసి మెప్పించారు. వైవిధ్యమైన కథలతో విభిన్న చిత్రాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. అయితే ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తూ వస్తుంది. ఇటీవల బాలయ్య ఓ ఈవెంట్‌లో అక్కినేని తొక్కినేని అంటూ సంచలన కామెంట్స్ చేయడంతో దీనిపై చైతూ, అఖిల్ కొంత ఘాటుగానే స్పందించారు. నాగార్జున మాత్రం ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అయితే బాలయ్య – నాగార్జున పదేళ్ల ముందు వరకు బాగానే ఉన్నా తర్వాత వీరి మధ్య గ్యాప్ పెరిగింది.
నాగార్జున ముందు నుంచి ఎక్కువుగా చిరంజీవితో క్లోజ్‌గా ఉండేవారు. చిరుతో వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నాడు. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యను హీరోగా పరిచయం చేసినప్పుడు కూడా బాలయ్య వచ్చి చైతును స్టార్ హీరో అవ్వాలని ఆకాంక్షించడంతో పాటు దీవించారు కూడా. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కడో గ్యాప్ రావడంతో ఏఎన్నార్ జీవితకాల సాఫల్య పురస్కారాల ప్రకటనలో నాగార్జున ఇండస్ట్రీలో ప్రముఖులు అందరిని ఆహ్వానించి బాలయ్యను మర్చిపోయారు. ఇదే బాలయ్యలో కోపానికి కారణమైందని అంటారు. అనంతరం నాగ్ స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లి బతిమిలాడినా కూడా పట్టించుకోలేదంటారు.
ఇక 2012 సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమానే ఇద్దరి మధ్య దూరానికి కారణమైనట్టు టాక్ వినిపిస్తోంది. శ్రీమన్నారాయణ చిత్రం 2012 ఆగస్టు 30వ తేదీన విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత నాగార్జున నటించిన షిరిడి సాయి సినిమా విడుదల అయింది. కాగా కూకట్ పల్లి లోని ఓ థియేటర్ లో బాలయ్య సినిమాను తీసేసి షిరిడి సాయి సినిమాను ప్రదర్శించడంతో బాలయ్య …నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల పై ఫైర్ అయ్యారట. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక ఏఎన్ఆర్ తో బాలయ్య మంచిగానే ఉన్నప్పటికీ ఆయన అంత్యక్రియలకు బాలయ్య హాజరు కాకపోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…