Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అతి తక్కువ కాలంలనే స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే మహేష్ విషయానికి వస్తే చాలావరకు ఆయన సాఫ్ట్ సినిమాలే గుర్తొస్తాయి. గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే.. దాదాపు అన్ని మూవీస్ లోనూ.. ఇతడు చాలా సెటిల్డ్ గా ఉన్న రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చాడు. ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా పడి చాలా కాలమే అయిపోయింది. ‘పోకిరి’ తర్వాత ఆ రేంజ్ మాస్ సినిమా ఎప్పుడొస్తుందా? మహేష్ మాస్ గా ఎప్పుడు కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సూపర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే మరికొందరు ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ ఈ సినిమాలో సాలిడ్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు తన ఇన్ స్టా లో జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయడంతో.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మహేష్ మాస్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ డైరక్షన్ లో హారిక – హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి కానుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు లుక్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. బాబులకు బాబు మా మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు బీస్ట్ లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం మనందరికి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…