Naga Shourya : పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న నాగ శౌర్య‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

Naga Shourya : టాలీవుడ్‌లో ఇటీవ‌ల పెళ్లి బాజా మోగుతుంది. హీరోలు లేదంటే హీరోయిన్స్ సైలెంట్‌గా పెళ్లి పీట‌లు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. నాగ శౌర్య పెళ్లికి సంబంధించి గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. అతని ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెళ్లికి సంబంధించిన ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇక మొత్తానికి నాగశౌర్య పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. న‌వంబర్‌ 20వ తేదీన అతని పెళ్లి బెంగళూరులో జరగనుంది. అతడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష.

బెంగళూరులోని విటల్‌ మాల్యా రోడ్డులో ఉన్న జేడబ్ల్యూ మారియట్‌ హోటల్లో వీళ్ల పెళ్లి జరగనుంది. ప్రస్తుతం అతని వెడ్డింగ్‌ ఇన్విటేషన్ వైరల్‌ అవుతోంది. నవంబర్‌ 20 ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేశారు. అమ్మాయికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అయితే తెలియాల్సి ఉంది. న‌వంబర్‌ 19న జరగబోయే మెహందీ వేడుకలతో పెళ్లి సంబరం మొదలుకానుంది. రెండు రోజుల పాటు కన్నుల పండుగగా వీళ్ల పెళ్లి వేడుక జరగనుంది.

Naga Shourya is getting married very soon know the bride
Naga Shourya

నాగశౌర్య గత ఏడాది నుంచి పెళ్లి చేసుకోవాలని తన కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదివరకే సైలెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అతని పెళ్లికి సంబంధించిన వార్తలు బయట వైరల్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పెద్దగా అఫీషియల్ గా ప్రకటించింది లేదు. ఇటీవల కృష్ణ వ్రింద విహారి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో మొత్తానికి నాగశౌర్య పెళ్లికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది చివరలో తాను పెళ్లి చేసుకోబోతున్నాను తను అచ్చమైన మన తెలుగు అమ్మాయి అని కూడా వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు అనూష అని తెలుస్తుండ‌గా, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా? లేక ప్రేమ వివాహమా? అనేది తెలియాల్సి ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago