Naga Shourya : టాలీవుడ్‌లో ఇటీవల పెళ్లి బాజా మోగుతుంది. హీరోలు లేదంటే హీరోయిన్స్ సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నాగ శౌర్య పెళ్లికి సంబంధించి గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. అతని ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెళ్లికి సంబంధించిన ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇక మొత్తానికి నాగశౌర్య పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. నవంబర్ 20వ తేదీన అతని పెళ్లి బెంగళూరులో జరగనుంది. అతడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష.
బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్డులో ఉన్న జేడబ్ల్యూ మారియట్ హోటల్లో వీళ్ల పెళ్లి జరగనుంది. ప్రస్తుతం అతని వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్ అవుతోంది. నవంబర్ 20 ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేశారు. అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. నవంబర్ 19న జరగబోయే మెహందీ వేడుకలతో పెళ్లి సంబరం మొదలుకానుంది. రెండు రోజుల పాటు కన్నుల పండుగగా వీళ్ల పెళ్లి వేడుక జరగనుంది.
నాగశౌర్య గత ఏడాది నుంచి పెళ్లి చేసుకోవాలని తన కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదివరకే సైలెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అతని పెళ్లికి సంబంధించిన వార్తలు బయట వైరల్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పెద్దగా అఫీషియల్ గా ప్రకటించింది లేదు. ఇటీవల కృష్ణ వ్రింద విహారి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో మొత్తానికి నాగశౌర్య పెళ్లికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది చివరలో తాను పెళ్లి చేసుకోబోతున్నాను తను అచ్చమైన మన తెలుగు అమ్మాయి అని కూడా వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు అనూష అని తెలుస్తుండగా, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా? లేక ప్రేమ వివాహమా? అనేది తెలియాల్సి ఉంది.