Coconut Water For Weight Loss : మనకు ఒంట్లో నీరసంగా అనిపించినా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగుతాము. మన శరీరానికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ నీళ్లలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా దొరికే కొబ్బరి నీళ్ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలను చేసి అలసిపోయేవారు చాలామందే ఉన్నారు. ఇలాంటి వారికి కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది.
దీనిలో ఉండే పొటాషియం, బయో ఎంజైమ్ లు తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి. ఇతర పండ్ల రసాలతో పోల్చితే కొబ్బరి నీళ్లలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పండ్ల రసాల్లో ఉండే చక్కెర రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచే ఛాన్స్ ఉంది. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి మీ ఎలక్ట్రోలైట్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. దీంతో మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎంజైమ్ లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. దీనివల్ల కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి.
కొబ్బరి నీళ్లలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా చేయడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లతో రోజును ప్రారంభిస్తే.. రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు. దీనిలో పిండి పదార్థాలు లేనప్పటికీ.. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీనిలో ఉండే పొటాషియం మీరు తొందరగా బరువు తగ్గడానికి మీ శరీరం నుంచి ఎక్కువ సోడియాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లను ఉదయం పరిగడుపున తాగడం మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీ గుండె, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.