Naga Chaitanya : అక్కినేని ఫ్యామిలీ హీరోలలో నాగ చైతన్య ఒకరు. ఆయన హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. తొలి చిత్రం ‘జోష్’తోనే తనలో మంచి నటుడు అని ప్రూవ్ చేసుకున్న నాగ చైతన్య ‘ఏ మాయ చేశావే’ మూవీతో హిట్ కొట్టారు.. ఈ ఫిల్మ్‌తో ఆయన అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. అనంతరం ‘100 పర్సెంట్ లవ్’, ‘తడాఖా’, ‘మనం’, ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాగ చైతన్య… ప్రస్తుతం ‘కస్టడీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు.
ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగ చైతన్య.. డేర్ అండ్ ట్రూత్ సెగ్మెంట్ లో ఓ ఆసక్తికర ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. మీ జీవితంలో అతిపెద్ద ప్రశ్యాతాపం ఏంటీ అని అడిగారు. దీనికి చైతూ ‘నా జీవితంలో అలాంటిది ఏం లేదు’ అని బదులిచ్చారు. ‘ప్రతిదీ ఓ పాఠమే’నన్నారు. ఆ వెంటనే డివోర్స్ తర్వాత ఏదైనా బాధపడ్డ ఘటన, సినిమాల పరంగానైనా ఉందా అని మళ్లీ ప్రశ్నించాడు. దీనికి చైతూ ఆసక్తికరంగా ఆన్సర్ చేశారు. సినిమాల పరంగా చాలా బాధపడ్డ ఘటనలు ఉన్నాయి. రెండు మూడు చిత్రాల విషయాల్లో మాత్రం రిగ్రీట్ గా ఫీల్ అయ్యినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక చైతూ, సమంత విడాకుల తర్వాత తమ తమ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక కాగా, మే 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై చైతూ ఫుల్ హోప్స్ పెట్టకున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…