Naga Chaitanya : అక్కినేని నాగార్జున టాలీవుడ్ మన్మథుడిగా అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు. నాగ్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు. ఆయన కూడా వారితో కాస్త చనువుగానే మెదులుతూ ఉంటారు. నాగార్జున తనయుడు నాగ చైతన్య విషయానికి వస్తే అతనికి చాలా బిడియం. రిజర్వ్ డ్‌గా ఉంటారు. తన సినిమా హీరోయిన్స్ తోను ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటారు. ఇక అతను వేరే హీరో మూవీ సినిమా హీరోయిన్స్ తో అయితే ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో హాయ్ అంటే హాయ్ .. బాయ్ అంటే బాయ్ అన్న మాదిరిగా మెలుగుతూ ఉంటారు.
ఇటీవల నాగ చైతన్య .. నిఖిల్ నటించిన స్పై మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి గెస్ట్‌గా వెళ్లారు. ఆ ఈవెంట్ లో చైతూ తెగ సందడి చేశారు. నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీ డేస్ లో పక్కింటి కుర్రాడి పాత్రతో మొదలుపెట్టి స్వామిరారా, కార్తికేయ తో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసి కార్తికేయ2 తో బాక్సాఫీసుని షేక్ చేశాడు. స్పై ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంటర్ నేషనల్ గా అనిపించింది. ఐశ్వర్య, సాన్య వెల్ కం టు టాలీవుడ్. ఆర్యన్ రాజేష్, జిషు, అభినవ్ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడి గా పరిచయం అవుతున్న గారీకి ఆల్ ది బెస్ట్. ఆయన నుంచి మరిన్ని సినిమాలు రావాలి. నిఖిల్ కార్తికేయ 2తో ఒక ట్రెండ్ సెట్ చేశారు.స్పై తో ఆ ట్రెండ్ ని దాటి నెక్స్ట్ లెవల్ కి వెళ్తారని నమ్ముతున్నాను అని నాగ చైతన్య అన్నారు.
అయితే వేదికపై నాగ చైతన్య పక్కన వచ్చి ఐశ్వర్య నిలుచోగా మనోడు కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వారిని నిఖిల్ పక్కన నిలుచోమని కోరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అయిన స్పై సినిమాని చరణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…