Nagababu : మెగా ఫ్యామిలీలో కొద్ది రోజుల క్రితం వరుస శుభవార్తలు విన్నాం. జూన్ 9న వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్, జూన్ 20న రామ్ చరణ్ కి కూతురు పుట్టడం, జూన్ 30న పేరు రివీల్ చేయడం ఇలా వరుస శుభవార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అలాంటి సమయంలోనే మెగా ఫ్యామిలీ నుండి నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు అనే ఒక అశుభ వార్త వచ్చింది.ఎప్పటినుంచో జనాలు ఊహిస్తున్నదే కానీ దానికి తెరదించడానికి విడాకులు నిజంగానే తీసుకోబోతున్నాం అంటూ అఫీషియల్ ప్రకటన చేయడంతో మెగా అభిమానులు చాలా బాధపడ్డారు. నిహారిక సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాగా, ఆమె జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీలో ఇమడలేకపోయింది.
పార్టీలు,పబ్బులు,వెకేషన్స్ అంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే నిహారిక కు సాంప్రదాయం, కట్టుబాట్లు అనేవి ఏమాత్రం సెట్ అవ్వలేక పోయాయి. దీంతో విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే నిహారిక విడాకులు తీసుకోవడానికి నాగబాబు కూడా ఓ కారణమని చెబుతున్నారు. ఆమెని అల్లారు ముద్దుగా పెంచడం వల్లనే నిహారిక విడాకులు తీసుకునేందుకు దోహదం చేసిందని చెబుతున్నారు. పెళ్లి తర్వాత అత్తారింట్లో ఎలా మసులుకోవలో నేర్పలేదని కొంత మంది మెగా సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. పెళ్లి తర్వాత అత్తారింట్లో నిహారిక పెద్దగా సర్ధుకుపోలేకపోవడంతో వారికి నాగబాబు వేరు కాపురం పెట్టించాడు. అయిన కూడా వారితో ఇమడలేక విడాకుల వరకు వెళ్లిందని చెబుతున్నారు.
నిహారిక విడాకుల తర్వాత నాగబాబు తొలిసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. డాక్టర్ల గురించి గొప్పగా చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం ఏ తప్పు చేసిన కూడా వేరే ఆప్షన్ ఉంటుంది. కాని వారికి అలా కాదు. వారు ఒక్క తప్పు చేసిన పెద్ద సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అని అన్నారు. కాగా, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రఖ్యాత క్యాన్సర్ సెంటర్ భాగస్వామ్యంతో రోజుకు వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను అందిస్తోంది. మొదట మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఇంతకుముందే చిరంజీవి ప్రకటించారు. మొదటి శిబిరం ఈ రోజు హైదరాబాద్‌లో ఇప్పటికే దిగ్విజయం అయింది. తర్వాత జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాలను ఏర్పాటు చేసారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అని నాగబాబు అన్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో నాగబాబు ఎక్కడ కూడా తన కూతురు మేటర్ తీయలేదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…