Pawan Kalyan : రోజాపై ప‌వ‌ర్‌ఫుల్ ఎటాక్.. పొత్తుల‌పై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు..

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర తొలి షెడ్యూల్ స‌క్సెస్ ఫుల్ కావ‌డంతో ఇప్పుడు రెండో విడ‌త కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే ఇప్ప‌టికే ఏలూరు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గజమాలతో ఏలూరు ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు ఇన్‌ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి, కొటికలపూడి గోవిందరావు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ర్యాలీగా క్రాంతి కళ్యాణ మండపంకు చేరుకున్నారు. అంతకు ముందు కృష్ణా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపైకి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ జిల్లా నాయకులు చలమచెట్టి రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వారాహి విజయయాత్ర కమిటీలతో శనివారం పవన్‌ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మనం కష్టపడి పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు.

Pawan Kalyan talked about roja and alliance with tdp
Pawan Kalyan

వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం తాను కళ్లారా చూశానని ప‌వ‌న్ అన్నారు. ఈ పోరాటం వృథా కాదని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ చూడాలంటే ఆ పార్టీ పతనం గోదావరి జిల్లాల నుంచే ప్రారంభం కావాలని జ‌న‌సేనాని చెప్పుకొచ్చారు. ప్రజాకంటక పాలన విముక్తి చేయడానికి మనం ఎంత బలంగా ముందుకు వెళితే.. రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని త‌న పార్టీ శ్రేణుల‌కి తెలియ‌జేశారు. ఇక వైసీపీ వాళ్లు ఎంత మొరిగిన మ‌నం ప‌ట్టించుకోకుండా మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ ముందుకు వెళదాం అని ఆయ‌న అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago