Naga Chaitanya And Sobhita Dhulipala : సమంత నుండి విడిపోయిన తర్వాత శోభితతో సీక్రెట్ ఎఫైర్ నడిపిన నాగ చైతన్య ఎట్టకేలకి ఆగస్ట్ 8న ఆమెని నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈరోజు ఉదయం 9:42 గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది అని అన్నారు. మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు తెలియజేయడం మాకు సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి స్వాగతించేందుకు సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది ”అని రాశారు.
దాంతో 8.8.8 అర్థం ఏంటి..? అనే దానిపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పోస్ట్ లో 8.8.8 అంటే ఏంటి అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మొదటి 8 ఈరోజు డేట్, రెండవ 8 ఈ నెలను సూచిస్తుంది. ఇక చివరి 8 ఏంటి అని ఆలోచిస్తున్నారు. 2024లోని నెంబర్స్‌ని కలిపితే 8 వస్తుంది. అలా లక్కీగా భావించి 8.8.8 అని పెట్టినట్లు తెలుస్తోంది. ఈ 8.8.8కు ఓ ప్రత్యేకత ఉంది. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ రోజుకు ఓ ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే దానిని లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. ఈ రోజు శుభకార్యాలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందట. సంఖ్యాశాస్త్రం పరంగా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా బలపడేందుకు ఈ రోజు అనువుగా ఉంటుందని చెబుతుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది సంఖ్య అదృష్టం, సంపద, పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా సూచిస్తారు. అలానే ఇది అంతులేని శక్తివంతమైన రోజుగా చెబుతారు.
జ్యోతిష్యశాస్త్ర పరంగా ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాల మధ్య శక్తి ప్రవాహాన్ని తెరుస్తుందట. వ్యక్తిగత ఎదుగుదల, ప్రవర్తన, ఆధ్యాత్మిక మేల్కోలుపులకు అనువైన సమయం. ముఖ్యంగా మీ గురించి మీరు తెలుసుకునేందుకు ఉత్తమమైన సమయం అని అంటుంటారు. అందుకే చైతన్య, శోభిత ఆగస్ట్ 8 న నిశ్చితార్థం జరుపుకున్నారని అంటున్నారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైయ్యారు. వీళ్ల పెళ్లి తేదీపై కూడా త్వరలోనే ఓ అధికార ప్రకటన కూడా రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…