Naga Chaitanya : సమంతతో బ్రేకప్ తర్వాత నాగ చైతన్య పర్సనల్ లైఫ్ మీడియాలో చర్చనీయాంశం కావడం మనం చూశాం. ఎందుకు వారిద్దరు విడాకులు తీసుకున్నారని తెగ చర్చ నడిచింది. అయితే సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లకు దగ్గరయ్యాడు. కొన్నాళ్లుగా శోభితతో నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నాడు. గత రెండేళ్లుగా వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ మీడియాలో కథనాలుగా వెలువడుతున్నాయి.నాగ చైతన్య తరచుగా తన కొత్త ఇంటికి శోభితను తీసుకువెళ్లేవాడట. పలుమార్లు జంటగా విదేశీ టూర్లు ఎంజాయ్ చేశారు. నాగ చైతన్య, శోభిత కలిసి ఉన్న ఫోటోలు సైతం లీక్ అయ్యాయి. శోభితతో ఎఫైర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చారు నాగ చైతన్య టీమ్. సడన్ గా నిశ్చితార్థం జరుపుకుని నాగ చైతన్య షాక్ ఇచ్చారు.
నాగ చైతన్య సమంత నుండి విడిపోయిన తర్వాత ఓ ఫ్రెండ్ బర్త్ డేలో శోభితని కలిసినట్టు సమాచారం. తొలి పరిచయం లోనే వీళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. ఆరో జునుంచే కలిసి తిరగడం కూడా స్టార్ట్ చేశారనే టాక్ బలంగా వినిపించింది. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని.. లైఫ్‌లో కూడా కలిసి ఉండాలని నిర్ణయించుకన్నట్టు సమాచారం. ఇకపోతే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 6 ఏళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. 1986లో నాగ చైతన్య జన్మించగా.. 1992లో శోభిత పుట్టింది. శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయి కావడం విశేషం.వేణుగోపాలరావు – శాంత దంపతుల కుమార్తె శోభిత. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసింది. క్లాసికల్ డాన్స్ లో కూచిపూడి, భరత నాట్యం రెండు నేర్చుకుంది.. ఆతరువాత 2013 ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచి ఆపై 2016లో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
సమంతకు ఐ లవ్ యు చెప్పిన తేదీ ఆగస్ట్ 8 కాగా, ఆ రోజు శోభితతో నిశ్చితార్థం జరుపుకోవడం వెనుక నాగ చైతన్య ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది. బహుశా నాగ చైతన్య సమంత మీద ఆ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడా? లేక అది యాదృచ్చికంగా జరిగిందా? అనేది తెలియాలి. కాగా సమంతతో విడాకులు నాగ చైతన్యను మానసిక వేదనకు గురి చేశాయని నాగార్జున వెల్లడించాడు. శోభిత రాకతో నాగ చైతన్య జీవితంలో తిరిగి సంతోషం వెల్లివిరిసినట్లు ఆయన చెప్పకనే చెప్పాడు. పెళ్ళికి ఇంకా సమయం ఉందని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…