Nadendla Manohar : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వాడి వేడిగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, మరోవైపు వైసీపీ నాయకులు కూడా అంతే ధీటుగా బదులిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల వైఎస్ జగన్ విద్యార్ధులకి సంబంధించిన కార్యక్రమంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం పట్ల మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇంగిత జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కేవలం పవన్ ను విమర్శించడానికే రూ.6 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి సభ పెట్టారని అన్నారు. జగన్ రెడ్డికి కాస్త సిగ్గుండాలి.. పాఠశాలల విద్యార్థుల సభలో ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ పై జగన్ ఆరోపణలు చేశారు. పవన్ లారీ ఎక్కితే మీకేంటి? మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా? ఏదో ఒక రోజు మీరు లారీ, కార్లపై తిరగాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా పవన్ పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
2024లో వైసీపీకి కాలం చెల్లుతుంది అని నాదెండ్ల జోస్యం చెప్పారు. ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది. దానికోసం జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు? తాను ఓడిపోయినా సరే రాజకీయాల నుంచి దూరంగా వెళ్లనని పవన్ చాలాసార్లు చెప్పారు. గత ఎన్నికల ఫలితాల తరువాత నాతో అన్నారు. అది ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమ. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ లాంటి దుర్మార్గపు నాయకులను ఇంటికి పంపించాలి అని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జగన్ వంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…