Kethi Reddy : హ‌నీ రోజ్‌తో మీటింగ్ పెడితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కన్నా ఎక్కువ జ‌నాలొస్తారంటూ కేతిరెడ్డి పంచ్‌లు

Kethi Reddy : వారాహి యాత్రలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ నాయ‌కులపై విరుచుక‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సీఎం జ‌గ‌న్ నుండి ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి గురించి దారుణంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ నాయ‌కులు సైతం ప‌వ‌న్‌ని విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. కొంద‌రు ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల గురించి ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా కేతిరెడ్డి.. ప‌వ‌న్ ని విమ‌ర్శిస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కంటే ‘వీరసింహారెడ్డి’ హీరోయిన్ హనీ రోజ్‌కే (Honey Rose) జనాల్లో క్రేజ్ ఎక్కువ ఉందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఒక పక్క హనీ రోజ్ కార్యక్రమం.. మరోపక్క పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగితే జనసేనాని మీటింగ్ కన్నా హనీ రోజ్ కార్యక్రమానికే ఎక్కువ జనం వెళ్తారని ఆయ‌న అన్నారు.

సినీ గ్లామర్ జనాలను అంతగా ఆకర్షిస్తుందని.. సినిమాలు, రాజకీయాలు ఎప్పటికీ ఒక్కటి కావని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. ప‌వ‌న్ ను చూసేందుకు మాత్ర‌మే జ‌నాలు ఆ ర‌కంగా వ‌స్తున్నార‌ని కేతిరెడ్డి చెప్పారు. వీరి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని వ్యాఖ్యానించారు. అందుకే తాము కూడా చూస్తూ ఊరుకుంటున్నామ‌ని తెలిపారు. ఇక‌, రాజ‌కీయాల్లో ఉన్న వారికి నిల‌క‌డ ఉండాల‌ని ప‌వ‌న్ ను ఉద్దేశించి విమ‌ర్శించారు.

Kethi Reddy comments on pawan kalyan meetings
Kethi Reddy

ఎవ‌రు రాజ‌కీయ పార్టీలు పెట్టుకున్నా కూడా మేము స్వాగ‌తిస్తాం. అయితే రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. త‌మ గెలుపు కోసం.. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌నిచేయాల‌ని అన్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం వేరే పార్టీకి ప‌ల్ల‌కీలు మోస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. మాకేమీ న‌ష్టంలేద‌ని వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సినిమాలు, రాజ‌కీయాలు వేర్వేర‌ని.. సినిమాలు చూసే జ‌నాలు అంద‌రూ.. న‌టుల‌కు జై కొడితే.. వారే అధికారంలోకి వ‌చ్చేవారు క‌దా అని కేతిరెడ్డి అన్నారు. పరుగు పందెంలో నేను ఫస్ట్ రావాలని పరిగెత్తాలే త‌ప్ప‌..పక్కనోడికి కాలు అడ్డంపెట్టి పడగొట్టి నేను గెలవాలనుకోవడం తప్పు. రాజకీయాల్లో ప్రాథమిక అంశాల మీద అవగాహన లేకుండా వచ్చినవాళ్లంతా మా జనాలే అనుకుంటే తప్పు’ అని ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు కేతిరెడ్డి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago