Gold : బంగారం ఖనిజాలు అంటే అందరికి కేజీఎఫ్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ సినిమా చూసి మన దగ్గర కూడా ఇలాంటిది ఉంటే బాగుండు అని అనుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. ఆ సమయంలోనే జమ్ముకశ్మీర్, రాజస్థాన్ వంటి చోట్ల పెద్ద ఎత్తున లిథియం నిల్వలు బయటపడ్డ సంగతి తెలిసిందే. అరుదైన ఖనిజాలను వెలికితీయడంలో నిమగ్నమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎమ్‌డీసీ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఖనిజాలని వెలికి తీసేందుకు సుమారు రూ.500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బంగారం నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని కొంత కాలం కిందటే గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహా మరికొన్ని సంస్థలు సర్వే చేసి బంగారం నిల్వలు ఎంత ఉన్నాయి అనే అంశంపై సమాచారాన్ని సేకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో ఉన్న ‘చిగర్ గుంట-బిసనత్తమ్’ బంగారు గనిలో 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనాకి వచ్చారు..చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలోని ఏడు గ్రామాల్లో విస్తరించిన గోల్డ్ బ్లాక్‌కు సంబంధించిన లీజును ఎన్‌ఎండీసీ త్వరలో దక్కించుకోనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ విషయమై గతేడాది ఏపీ ప్రభుత్వంతో ఎన్‌ఎండీసీ ఒప్పదం చేసుకుంది.
ఒక్కో టన్ను నుంచి 5 గ్రాములకు పైగా బంగారం తీయవచ్చని అంచనా వేస్తున్నారు.. ఈ గనిలో తవ్వకాలు చేపట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసింది ఎన్ఎండీసీ. ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు వంటి క్లియరెన్స్ తెచ్చుకోవడానికి ఎన్ఎండీసీ కంపెనీ ఒక కన్సల్టెంట్ ను నియమించాలని యోచిస్తుంది. ఒక్కో టన్ను ఖనిజం నుంచి సుమారు 5 గ్రాములకుపైనే బంగారం లభిస్తుందని నిర్ధరించారు. ఇప్పుడు ఈ గనిలోనే ఎన్‌ఎండీసీ తవ్వకాలు మొదలుపెట్టనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…