Jagapathi Babu : ఫ్యామిలీ హీరో జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉండేవారు. మంచి సినిమాలు చేసి కోట్లు సంపాదించిన జగపతి బాబు జూదంలో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతిబాబు కెరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఒక దశలో ఆయన చేతిలో చిల్లిగవ్వ లేదు చేయడానికి సినిమాలు లేవు. దానికి తోడు అప్పులు. ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కావడానికి వ్యసనాలే అన్న ప్రచారం జరిగింది. పెద్ద పెద్ద కాసినోలకు పోయి జూదం ఆడేవాడట. హార్స్ రైడింగ్ బెట్టింగ్ కట్టేవాడట. ఈ వ్యసనాలు నన్ను దెబ్బతీశాయట.
అమెరికాలో కూడా జూదం ఆడడం వలన కోట్ల రూపాయలు కోల్పోయాడని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు జూదం వలన నేను ఆస్తులు పోగొట్టుకోలేదని చెప్పాడు. ఇప్పటివరకు నేను దాదాపు రూ. 1000 కోట్లు సంపాదించి ఉంటాను. ఆ డబ్బంతా ఎలా పోయిందంటే నా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు అని అన్నారు.. జూదంలో నేను సంపద పోగొట్టుకోలేదు. గ్యాంబ్లింగ్ నేను సరదా కోసమే ఆడతాను. నాకు డబ్బులు ఎలా దాచాలనే విషయంలో జీరో నాలెడ్జ్. సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేయలేకపోయాను.
డబ్బులు పోగొట్టుకున్న విషయంలో ఒకరి బ్లేమ్ చేయను కూడా. చెప్పాలంటే చాలా మందే ఉన్నారు. బ్రోకర్స్ వల్ల కావచ్చు. నేను కూడా అజాగ్రత్తగా ఉండకపోవడంతో అలా జరిగి ఉండచ్చు. ఇందులో నా పొరపాటు కూడా తప్పకుండా ఉందని’ తెలిపారు. ఒక్క రూపాయి కూడా లేని స్థితిలో అన్నిపోనూ రూ.30 కోట్ల ఉంటే చాలని తాను భావించారట. జగపతి బాబు పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపారనే ప్రచారం కూడా ఉంది. ప్రియమణి విషయంలో ఆయన పేరు మారుమ్రోగింది. ఈ వీక్నెస్ తో కూడా జగపతిబాబు కోట్లు కోల్పోయాడని బాగా ప్రచారం జరిగింది. జగపతిబాబు తండ్రి విబి రాజేంద్రప్రసాద్ ప్రముఖ నిర్మాత కాగా, ఆయన కూడా పలు సినిమాలు తీసి చేతులు కాల్చుకొని నష్టపోయాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…