Nadendla Manohar : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఎప్పుడో పదేళ్ల కిందట ఆయన ఇలా వెళ్లారు. మళ్లీ ఇప్పుడు వెళ్లారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించారు కదా.. ఇప్పుడు అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, చంద్రబాబు కూడా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఐతే.. వీరు ఏం చర్చించారన్నది ఇప్పుడు మెయిన్ టాపిక్ అయ్యింది. ఇద్దరు నేతలు సుమారు రెండున్నర గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.. మరో ఒకటి రెండు సమావేశాలు జరగనున్నాయి. సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి మేనిఫెస్టో పైనా ఇద్దరు నేతలూ చర్చించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా ఇద్దరు నేతలూ చర్చించినట్టు సమాచారం.. ఇద్దరూ కలిసి బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.. అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఈ భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరాలు తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వివిధ అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్టు నాదెండ్ల వివరించారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగింది. పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. భవిష్యత్తులోనూ రెండు పార్టీల శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళతాయి. మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తాం” అని నాదెండ్ల పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…