CM Revanth Reddy : చంద్ర‌బాబు లేకుంటే మీరు ఉండేవారా..రేవంత్ రెడ్డి స్పీచ్‌కి కేటీఆర్ ఢ‌మాల్

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన ప‌దేళ్ల‌కి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌రైంది. అయితే రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీలో రేవంత్, కేటీఆర్ మ‌ధ్య చ‌ర్చ జోరుగా సాగింది. బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ మాట్లాడిన సీఎం… కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత హరీశ్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. గతం గురించి మాట్లాడాలనుకుంటే… ప్రత్యేకంగా సమయం కూడా పెట్టుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగంపై శనివారం సభలో చర్చ ప్రారంభం కాగా… కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది.

గత కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కేటీఆర్ మాట్లాడటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. తొలుత మంత్రులు… కేటీాఆర్ ప్రసంగానికి అడ్డుతగలగా… ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ కు ప్రజాస్పూర్తిపై అవగాహన లేదన్నారు. 49 శాతాని, 51 శాతానికి తేడా ఉంటుందని గెలిచిన సీట్ల గురించి చెప్పుకొచ్చారు. 51 శాతం వచ్చిన వారికి వంద శాతం ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా విలువ ఉంటుందన్నారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy comments on kcr and ktr about tdp
CM Revanth Reddy

కేసీఆర్‌కు యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ అవకాశం ఇచ్చి రాజకీయ జీవితం ప్రసాదించిందే కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. గత పాలనలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే అని చెప్పారు. కేకే, మహేందర్ రెడ్డి సీటు గుంజుకొని కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారన్నారు.అయితే దీనిపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరాలన్నారు. ఎన్నారైలకు టికెట్ అమ్ముకున్నది ఎవరో చెప్పాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఎన్నారై అంటూ రేవంత్ మాటలకు ధీటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణ బలిదేవత ఎవరో అందరికీ తెలుసని.. బలిదానం, నియంతృత్వం గురించి కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago