Mukesh Khanna : బాలీవుడ్ హీరోల‌పై శ‌క్తిమాన్ యాక్ట‌ర్ ఆగ్ర‌హం.. ఎందుకంటే..?

Mukesh Khanna : పొగాకు ఉత్ప‌త్తులు ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అవి క్యాన్స‌ర్ కార‌కాలు అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు సెల‌బ్రిటీల ప్ర‌చారాన్ని న‌మ్మి మోస‌పోతున్నారు. స్టార్లు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి అమాయ‌క ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించ‌డంపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా సెల‌బ్రిటీలు అందులో న‌టిస్తూ పోతున్నారు. గత ఏడాది పొగాకు బ్రాండ్ విమల్ కోసం షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లతో కూడిన ప్రకటన ఎయిర్ లోకి రాగానే అభిమానులు దానిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. పొగాకును ప్రోత్సహిస్తున్నందుకు సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం ఇందులో న‌టించిన స్టార్ల‌ను నిందించింది.

పాన్ మసాలా వంటి బ్రాండ్‌లపై యాడ్స్‌లో నటించే హీరోలపై ఎంత విరుచుకుప‌డిన వారు ఆగ‌డం లేదు. తాజాగా, టెలివిజన్ శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా పలు వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్ తదితరులు పలు పాన్ మసాలా యాడ్స్‌లలో నటిస్తున్నారు. వీరంతా ఇలాంటి యాడ్స్‌లో యాక్ట్ చేయద్దని, ఇప్పటినుంచి మానేయాలని ముఖేల్ కన్నా కోరారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే అక్షయ్ కుమార్ వంటి వారు కూడా భయంకరమపై పాన్ మసాలా వంటి యాడ్స్‌లో నటించడం బాధాకరమన్నారు. ఆయనను కలిసి మాట్లాడానని చెప్పుకొచ్చారు.

Mukesh Khanna angry on bollywood star actors
Mukesh Khanna

నేను అక్షయ్ కుమార్‌ని కూడా తిట్టాను అని ముఖేష్ అన్నారు. పెద్ద స్టార్లు ఇలాంటి ప్రకటనలు చేసే ముందు మరింత బాధ్యతగా ఉండాలని భావిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా..ముఖేష్ ఇలా అన్నారు. “నన్ను అడిగితే వారిని ప‌ట్టుకుని త‌న్నండి అని అంటాను. ఈ విషయం వారితో చెప్పాను. నేను అక్షయ్ కుమార్‌ని కూడా తిట్టాను. అతడు ఆరోగ్యానికి అంబాసిడ‌ర్ అయితే అతను `ఆదాబ్` అని చెప్పాడు. అజయ్ దేవగన్ `ఆదాబ్` అని చెప్పాడు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ కూడా అదే చేస్తున్నాడు. ఈ ప్రకటనల తయారీకి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి మీరు ప్రజలకు ఏం బోధిస్తున్నారు?.. వారు అంటున్నారు.. మేము పాన్-మసాలా అమ్మడం లేదని… వారు దానిని సుపారీ (బీటిల్ నట్) అంటున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు!.. అని స్టార్ల‌ను సూటిగా విమ‌ర్శించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago