Money In DCM : ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఎవరు అధికారంలోకి వస్తారా అని ఇప్పటి నుండే ఒక్కొక్కరు జోస్యాలు చెబుతూ పోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరు అంటుంటే, మరి కొందరు వైసీపీనే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. అయితే వైసీపీ నాయకులు సీక్రెట్‌గా డబ్బులు పంచుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు . రీసెంట్‌గా తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద వైసీపీ ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు స్వాదీనం చేసుకున్నారు. రేణిగుంటలో వైసీపీ ప్రచార సామాగ్రిని నిల్వ చేసుకొని లారీ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గాజులు మన్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని గోడౌన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గోడౌన్ తాళాలు తీసి మొత్తం పరిశీలించేంతవరకు కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. ఈ సంధర్బంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణా యాదవ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. గోడౌన్ తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గోడౌన్ తెరిచే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని పట్టుబట్టారు. పేపర్లో కథనాలు వస్తున్నా కూడా వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని అన్నారు.
పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం టీడీపీకి సంబంధించిన పది పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని ఇంత భారీగా తరలిస్తున్న వైసీపీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరిగితే అస్సలు ఊరుకునేది లేదని వారు అంటున్నారు. ఈ ఇష్యూ ఇటీవల ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు పుట్టించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…