Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి చాలా హీట్‌గా నడుస్తుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తూ పోసుకుంటూ తెగ రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు పదేపదే ఆయన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉండవల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు ఒకే రోజు రెండు సార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. గత మూడు రోజుల్లో నాలుగు సార్లు కాన్వాయ్ ఆపి సోదాలు చేశారంటున్నారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని కాన్వాయ్‌లోని కార్లన్నింటినీ పరిశీలించారు. వాహనం దిగి లోకేష్ కూడా సహకరించారు.
ఇటీవల పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు.. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొడానికి వెళ్తోన్న సమయంలో తనిఖీలు చేయగా.. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఆయన ప్రచారం సాగుతోందని నిర్ధారించారు. అయితే మా వాహనాలు ఆపుతున్నారే తప్ప వైసీపీ వాళ్లవి ఎందుకు ఆపడం లేదు. గాడుదులు కాస్తున్నారా అంటూ ఆగ్రహ వ్యక్తం చేశాడు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.
లోకేష్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేష్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం టార్గెట్ చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. మార్చి 20వ తేదీ ఉదయం 8 గంటలకు, 23వ తేదీ ఉదయం 8 గంటలకు.. అలాగే మార్చి 25 ఉదయం 8.10 నిమిషాలకు, సాయంత్రం 5 గంటలకు లోకేష్ కాన్వాయ్ ఆపి మరీ తనిఖీలు నిర్వహించారని మండిపడ్డారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…