MLC Kavitha : తీహార్ జైలులో క‌విత‌.. అక్క‌డ ఎలా ఉందంటే..?

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.. రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఈ కేసులో ముందు నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇటీవ‌ల‌ ఈడీ అరెస్ట్ చేయగా.. పది రోజుల కస్టడీ తర్వాత ఆమెకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతత‌రం కవితను రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించారు.అయితే తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజకీయ లాండరింగ్ కేసు అని మద్యం కుంభకోణంలో ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

మరోవైపు ఈడీ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. కవిత మేనల్లుడి ద్వారా నిధులను మళ్లించారనే ఈడీ దర్యాప్తులో కనుగొన్నట్టు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు.అయితే ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. కాగా కవితను తీహార్ జైలు నుంచే విచారణ జరిపే అవకాశాలున్నాయి.

MLC Kavitha transferred to thihar jail
MLC Kavitha

అయితే.. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంటి భోజనంతో పాటు పెన్నులు, పేపర్లు, చదువుకునేందుకు బుక్స్, ఇంటి నుంచి దుస్తులు పంపించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాగా.. ఇప్పుడు తీహార్ జైలుకు వెళ్లగా.. అక్కడ కూడా కవితకు కొన్ని ప్రత్యేక సదుపాయాలకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం. కవితకు ఇంటి భోజనంతో పాటు.. హైబీపీ కారణంగా అందుకు సంబంధించిన మెడిసిన్స్ కూడా అనుమతించింది కోర్టు. ఇవే కాకుండా.. ప్రత్యేకంగా పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు.. తన ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago