Chandra Babu : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం కుప్పంలో పర్యటించి.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కుప్పం అభివృద్ధికి 35 ఏళ్ల పాటు తాను పడిన కష్టాన్ని కేవలం ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తిరిగి అభివృద్ధిని పట్టాలెక్కిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన అన్ని ప్రణాళికలు రచించి అమలు చేస్తామని చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాయలసీమలో చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గమైన కుప్పం వేదికగా నేటి నుండి ప్రారంభించనున్నారు. ఓవైపు ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంటే, మరోవైపు చంద్రబాబు కుప్పం నుండి, ప్రజా గళం పేరుతో బహిరంగ సభలు, రోడ్ షోలతో రచ్చ చేయనున్నారు.
కుప్పం నుంచి తన గెలుపును మరోసారి రెన్యువల్ చేయాలని కోరారు చంద్రబాబు. టీడీపీకి ఓటేస్తేనే ఇంట్లో మగవాళ్లకు తిండిపెట్టాలని మహిళలకు చంద్రబాబు సూచించారు. ఇంట్లో మగవాళ్లు ఓటేయకుంటే తిండిపెట్టడం మానేయండి. ఎన్నికల రోజు చెప్పండి. తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. తెలుగుదేశానికి ఓటేస్తేనే ఇంట్లోకి రానిస్తాం. భోజనం పెడతామని చెప్పండి. ఎక్కడికీ పోరు” అంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రచార సభలు రాయలసీమలో పొలిటికల్ పొలిటికల్ హీట్ ను పెంచనున్నాయి.
అయితే చంద్రబాబు సభలో మహేష్ అనే యువకుడు తన విజన్, మిషన్ ఏంటనేది చంద్రబాబుకి క్లియర్‌గా చెప్పాడు. అది విని మాజీ సీఎం ఒకింత ఆశ్చర్యపోయాడు. నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయిందని, తన ఇంట్లోనే ఆ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. మనవాళ్లు చాలా మంది వేరే ప్రాంతాలలో ఉన్నారు. వారిని పిలిపించి ఓటు వేయించాలి. లక్ష ఓట్లు తెలుగు దేశంకి రావడం పెద్ద సమస్య ఏమి కాదు అని అన్నారు. దీనిపై మాట్లాడిన చంద్రబాబు నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలని ,ఆర్దిక సమస్యని సాల్వ్ చేయడం, పర్యావరణంపై దృష్టి పెట్టాలని మహేష్ అడిగాడు. ఇవన్నీ కూడా మన టీడీపీ ప్రభుత్వంలో తప్పక వస్తాయని చంద్రబాబు తెలియజేశారు. కుప్పంలో మంచి వాతావరణం ఏర్పడేలా చేస్తానని అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…