MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.. రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఈ కేసులో ముందు నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇటీవల ఈడీ అరెస్ట్ చేయగా.. పది రోజుల కస్టడీ తర్వాత ఆమెకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతతరం కవితను రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించారు.అయితే తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజకీయ లాండరింగ్ కేసు అని మద్యం కుంభకోణంలో ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
మరోవైపు ఈడీ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. కవిత మేనల్లుడి ద్వారా నిధులను మళ్లించారనే ఈడీ దర్యాప్తులో కనుగొన్నట్టు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు.అయితే ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. కాగా కవితను తీహార్ జైలు నుంచే విచారణ జరిపే అవకాశాలున్నాయి.
అయితే.. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంటి భోజనంతో పాటు పెన్నులు, పేపర్లు, చదువుకునేందుకు బుక్స్, ఇంటి నుంచి దుస్తులు పంపించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాగా.. ఇప్పుడు తీహార్ జైలుకు వెళ్లగా.. అక్కడ కూడా కవితకు కొన్ని ప్రత్యేక సదుపాయాలకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం. కవితకు ఇంటి భోజనంతో పాటు.. హైబీపీ కారణంగా అందుకు సంబంధించిన మెడిసిన్స్ కూడా అనుమతించింది కోర్టు. ఇవే కాకుండా.. ప్రత్యేకంగా పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు.. తన ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది.