Minister Seethakka : ఎన్న‌డు లేని కోపం తెచ్చుకున్న సీత‌క్క‌.. ఆటోవాళ్ల‌ని రెచ్చ‌గొట్టి మా మీద‌కు వ‌దులుతున్నావా..!

Minister Seethakka : చాలా ఏళ్ల త‌ర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. దాంతో దొరికిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు.గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని యన్నెం శ్రీనివాస్ రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఏసీ ఎజెండాను ప్రవేశపెట్టనున్నారు.అయితే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.

గతంలో వ్యవసాయేతర భూములకు కూడా రైతు బంధు ఇచ్చిన వారు పేదలకు లాభం చేకూర్చితే ఎందుకు విమర్శిస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలో వద్దో స్పష్టంగా చెప్పాలని సూచించారు.ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు ఇచ్చారు. మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావాలా? వద్దా? అనేది సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంది అంటూ సీతక్క మండిపడ్డారు.

Minister Seethakka sensational comments on ktr
Minister Seethakka

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులు ధ్వంసం చేసి, కుదేళ్లు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యకు కారణమైన వీళ్లు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పేద వాళ్ల ఎక్కే బస్సు రేట్ల పెంచి.. ఇవ్వాలా ఆడవాళ్లు బస్సులో ఉచితంగా వస్తే తట్టుకోలేక పోతున్నారు. రైతు బంధు పేరుతో ఎంతో మంది ధనవంతులకు లక్షల రూపాయలు కట్టబెడితే పేదవారు ఎవరైనా మీ ఇంటికి ముందుకు వచ్చి ధర్నాలు చేశారా?, ఈ రోజు ఆటోల అంశం ముందుకు పెట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అమె అన్నారు. ఈ బీఆర్ఎస్ ఎప్పుడు సెంటిమెంట్ ని వాడుకుని ఒకర్ని ముందు పెట్టి, వెనుక నుంచి మీరు వస్తారు, ఇది మీ నైజం అంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago