Minister Seethakka : చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విమర్శల వర్షం గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని యన్నెం శ్రీనివాస్ రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఏసీ ఎజెండాను ప్రవేశపెట్టనున్నారు.అయితే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
గతంలో వ్యవసాయేతర భూములకు కూడా రైతు బంధు ఇచ్చిన వారు పేదలకు లాభం చేకూర్చితే ఎందుకు విమర్శిస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలో వద్దో స్పష్టంగా చెప్పాలని సూచించారు.ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు ఇచ్చారు. మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావాలా? వద్దా? అనేది సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంది అంటూ సీతక్క మండిపడ్డారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులు ధ్వంసం చేసి, కుదేళ్లు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యకు కారణమైన వీళ్లు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పేద వాళ్ల ఎక్కే బస్సు రేట్ల పెంచి.. ఇవ్వాలా ఆడవాళ్లు బస్సులో ఉచితంగా వస్తే తట్టుకోలేక పోతున్నారు. రైతు బంధు పేరుతో ఎంతో మంది ధనవంతులకు లక్షల రూపాయలు కట్టబెడితే పేదవారు ఎవరైనా మీ ఇంటికి ముందుకు వచ్చి ధర్నాలు చేశారా?, ఈ రోజు ఆటోల అంశం ముందుకు పెట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అమె అన్నారు. ఈ బీఆర్ఎస్ ఎప్పుడు సెంటిమెంట్ ని వాడుకుని ఒకర్ని ముందు పెట్టి, వెనుక నుంచి మీరు వస్తారు, ఇది మీ నైజం అంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు.