CM YS Jagan : వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఘోరంగా అవమానించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ ఘటన చోటుచేసుకోగా, ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హస్తిన పర్యటనలో ఉన్న జగన్‌కు పార్లమెంట్ ఆవరణలో మాగుంట పలకరించి షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు.. అంటీముంటన్నట్లుగానే జగన్ వ్యవహరించారు. సీఎంను చూడగానే.. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగిందని ఎంతో మర్యాదపూర్వకంగా నమస్కరించి, చేతులు కలపగా అబ్బే అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చారు.
కాస్త హర్ట్ అయిన మాగుంట.. కనీసం జగన్ వెంట పార్లమెంట్ లోనికి వెళ్లడానికి సాహసించలేదు. వైఎస్ జగన్ వెంట.. ఎంపీలు విజయసాయిరెడ్డి వంగా గీత మరికొందరు ఎంపీలు మాత్రమే వెళ్లారు. జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కుతుండగా ముందుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఎందుకో వెళ్లలేకపోయారు. అయితే ఈ గ్యాప్‌లో.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మాగుంట గురించి విజయసాయితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. ‘మేం ఎవరూ ఆయన్ను పిలవలేదు.. ఆయన ఎందుకొచ్చారో కూడా మాకు తెలియదు..?’ అని జగన్‌కు సాయిరెడ్డి బదులిచ్చినట్లుగా సమాచారం. ఈ మాటలు విన్న జగన్.. ‘ఏంటిది చూస్కోవాలిగా సాయన్నా.. అన్నీ తెలిసిన నీ ఆధ్వర్యంలో ఇలా జరగడమేంటి..?’ అని ఒకింత అసహనం వెలిబుచ్చినట్లుగా సమాచారం.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బూతులు తిట్టాలని.. అలాగే ఒంగోలు ఎంపీ టికెట్ కోసం కోట్లు తీసుకుని రావాలని మాగుంటకు వైఎస్ జగన్ అల్టిమేటం జారీచేశారట. అయితే.. ఈ రెండు పనులూ చేయడానికి మాగుంట సిద్ధంగా లేరట. ఒకట్రెండు రోజులు చూసిన జగన్.. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయనపై కోపం పెంచుకుని అసలు మాగుంట పార్టీకి అవసరం లేదని పక్కనెట్టేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. తనకు జరిగిన అన్యాయం తెలుసుకున్న మాగుంటి తన కుమారుడు రాఘువరెడ్డితో కలిసి.. టీడీపీలో చేరాలని సన్నాహాలు చేస్తున్నారు మాగుంట. ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…