Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ వీడియో చూపించి క‌డిగి పారేసిన ఉత్త‌మ్

Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీ చాలా వాడివేడిగా సాగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయ‌కుల మ‌ధ్య హోరాహోరీగా పోరాటం సాగుతుంది. ఏపీలో ఆయకట్టులో లేని ప్రాజెక్టులు నిర్మాణానికి కేసీఆర్‌ సహకారం ఉందని తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. కెఆర్‌ఎంబికి సాగునీటి ప్రాజెక్టుల్ని అప్పగించేది లేదని తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ జగన్‌ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు.మొదటగా జగన్‌ మాట్లాడిన ఓ వీడియోను కాంగ్రెస్ హ్యాండిల్స్‌ వైరల్ చేశాయి. ఆ వీడియోలో నీళ్ల విషయంలో కేసీఆర్ ఉదారత చూపించారని జగన్ చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాలను ఏపీకి అప్పగించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్‌ 30న పోలింగ్‌ జరగడానికి ముందు ఒక్క రోజు 29 అర్థరాత్రి ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడి గట్టు గేట్లను బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు. ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి ఆ సమయంలో జగన్ అలా చేశారనే అనుమానం అందరికి ఉందన్నారు. 400-500 మంది బలగాలతో 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్నారన్నారు. ఆ సమయంలో కేసీఆర్‌, జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్‌ ఓడిపోతున్నారని తెలిసి జగన్ ఆంధ్రా పోలీసుల్ని సాగర్‌ మీదకు పంపారనే అనుమానాలు ఉన్నాయని ఉత్తమ్ ఆరోపించారు. సాగర్‌ గేట్లను స్వాధీనం చేసుకునే విషయంలో ఈ రోజుకు కేసీఆర్ ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

Uttam Kumar Reddy shown cm ys jagan video
Uttam Kumar Reddy

అయితే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని, ఎడిటెడ్ వీడియోలను వైరల్ చేస్తోందని మండిపడుతున్నారు. జగన్‌ స్పీచ్‌కు సంబంధించిన పూర్తి వీడియోను బీఆర్ఎస్ నేతలు స‌ర్క్యులేట్ చేస్తున్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలం లేదా సాగర్‌కు తరలించి కృష్ణా ఆయకట్టును కాపాడుకుందామని కేసీఆర్ ఉదారత చూపారని జగన్ చెప్పారు. పైన నాసిక్ నుంచి వచ్చే ప్రధాన పాయ నుంచి గోదావరికి నీళ్లు రావట్లేదని.. తెలంగాణలో ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి దాదాపు 50 శాతం గోదావరికి నీటిని తీసుకువస్తున్నాయని జగన్ చెప్పారు. ఇక కృష్ణాపై కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో నీళ్లు రాలేని పరిస్థితి ఉందని జగన్ అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం కృష్ణా నీటిని ఏపీకి కేసీఆర్ దోచి పెట్టారన్నట్లుగా ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago