CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా సాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయకులపై అనేక విమర్శలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి వివాదాలపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి రాసిచ్చేశామంటూ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని.. అసలు కృష్ణాజలాలను ఏపీకి రాసిచ్చింది కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేవంత్‌రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. పలు అంశాల్లో ఆ పార్టీ నేతలను చెడుగుడు ఆడేసుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో బీఆర్ఎస్‌ను అసెంబ్లీలో షేక్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్ర పునర్విభజన బిల్లు నా సూచన మేరకే వచ్చిందని కేసీఆర్ పదే పదే చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? నరేంద్ర మోదీ నల్లగొండలో ఉంటారా? ఢిల్లీలో ఉంటారా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. దమ్ముంటే ఢిల్లీలో చూస్కోండి. గల్లీలో కాదు. జంతర్ మంతర్ లో ధర్నా చేయండి. మేము కాపాలా ఉంటాం. నాగార్జునసాగర్ మీదకి జగన్ తుపాకులతో వస్తే.. చేత కాక కూర్చున్నారు. రాయలసీమకు పోయినప్పుడు మంత్రి రోజా ఇంటికి వెళ్లి ఆమె పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు కేసీఆర్. రాయలసీమ ఎత్తిపోతల పథకం.. జీవో 203 రూపొందించుకుంది ప్రగతి భవన్ లోనే. ఏపీ.. ఒక్కరోజు 12.5 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించుకుపోయేలా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళు మూసుకున్నారు.
తెలంగాణకు ఎస్ ఎల్ బీసీని.. తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలమూరు-రంగారెడ్డి పదేళ్లలో పూర్తి చేయలేదు. పదేళ్లలో కృష్ణా నీళ్లలో మరణశాసనం రాశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుంటే మా కాళ్ళకు అడ్డం పడుతున్నారు. కృష్ణా జలాల నీళ్లు అప్పగించింది కేసీఆర్ కాదా? 68శాతం క్యాచ్ మెంట్ ఏరియా ఉంటే.. 33శాతం నీటి వాటా 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. సంతకాలు చేయడం వల్ల.. కృష్ణాలో తెలంగాణకు మరణశాసనం రాశారు. 2014లో కొత్తలో చేశారేమో అనుకున్నాం. కానీ 2016తో పాటు 2023 వరకు సేమ్ సంతకాలు చేశారు. దీనికి హరీశ్ రావు ఏం సమాధానం చెబుతారు? జగన్ ఆక్రమించుకుంటే ఏం చేశారు?” అని నిలదీశారు రేవంత్ రెడ్డి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…