Minister KTR : చంద్ర‌బాబు అరెస్ట్ విష‌యంలో త‌ప్పు నాదే.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Minister KTR : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ స‌మ‌యంలో తెలంగాణ ఎన్నికల్లొ అక్కడ సెటిలైన సీమాంధ్ర ఓటర్ల మద్దతు గురించి స్పష్టత ఇచ్చారు కేటీఆర్. సీఎం జగన్ తో పాటుగా టీడీపీ నేతలతో ఉన్న సంబంధాల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. తెలుగుదేశం కు కీలక సూచన చేసారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించినదని, తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అరెస్ట్ కు నిరసనగా ఇక్కడ ర్యాలీలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహాంలో తమ పార్టీ తటస్ఠంగా ఉందని తెలిపారు.

చంద్రబాబు అరెస్టుతో మాకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్ లో ఒకరితో ఒకరు తలపడండి. అంతేకాని హైదరాబాద్ లో ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు. సున్నితమైన విషయాలను సెన్సిటివ్ గానే హేండిల్ చేయాలి. ఏపీలో ఏమైనా చేసుకోవచ్చు. ఆ రెండు పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదనే ర్యాలీలను అనుమతించడం లేదు. హైదరాబాద్ లో ర్యాలీలకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని చెప్పాను. జగన్, పవన్, లోకేశ్ నాకు దోస్తులే. ఏపీ ప్రజలు ఇక్కడ బాగానే వున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటీ కారిడార్ ర్యాలీలు జరగలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఐటీ పరిశ్రమకు ఇబ్బంది కలుగుతుంది.

Minister KTR sensational comments on chandra babu arrest
Minister KTR

టీడీపీ నేతలు ఏపీలో రాజకీయ పోరాటం చేస్తున్నారని..ఇకే సమయంలో ఎంత మందితో గొడవ పెట్టుకుంటారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమ పైన సానుభూతితో ఉన్నవారిని వదిలేసుకుంటారా అని వ్యాఖ్యానించారు. తమకు టీడీపీలోని పలువురితో సత్సంబంధాలు ఉన్నాయని..సీఎం జగన్, పవన్, లోకేశ్ తోనూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago