Meena : భ‌ర్త‌ను కోల్పోయిన అనంత‌రం.. మీనా కీల‌క నిర్ణ‌యం..

Meena : బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత హీరోయిన్‌గాను ఎంద‌రో ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది మీనా. 1982లో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె దాదాపు 50 సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగానే స్టార్‌‌డమ్ చూసింది. రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘నవయుగం’ సినిమాతో మీనా హీరోయిన్‌గా మారారు. అదే ఏడాది తమిళంలోనూ ఫిమేల్ లీడ్‌గా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో ‘సీతారామయ్యగారి మనవరాలు’, కోలీవుడ్‌లో ‘ఒరు పుదియ కాదల్’ సినిమాలు మీనాకు మంచి విజ‌యాల‌ని అందించ‌డంతో ఇక వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. సౌత్‌ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా కూడా మారింది.

సెకెండ్ ఇన్నింగ్స్ లో మీనా కాస్త సెలెక్టివ్‌గా ఉంటూ. తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలు వస్తేనే చేస్తున్నారు. ‘దృశ్యం’ సినిమాలోని పాత్ర తనకి చాలా మంచి పేరు తెచ్చింది. అలాగే.. టెలివిజన్‌ ఫీల్డ్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. లక్ష్మీ, కల్యాణం, అనుబంధాలు లాంటి సీరియల్స్ లో నటించారు. రియాలిటీ షోస్ కు జడ్జిగారూ వ్యవహరించింది. ఒకవైపు కెరీర్ మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్ స‌జావుగా సాగేలా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన మీనాకి జూన్ 28న మీనా జీవితంలో అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు.

Meena took important decision after her husband death
Meena

తక్కువ ప్రాయంలోనే ఆమె తోడును కోల్పోవ‌డంతో మీనా కుమిలిపోయింది. 2009లో మీనా బెంగుళూరుకి చెందిన సాఫ్ట్ వేర్‌ని వివాహం చేసుకోగా, దురదృష్టవశాత్తు విద్యాసాగర్ ఈ ఏడాది ఆమెకు శాశ్వతంగా దూరం అయ్యారు. అయితే మానసిక వేదన నుండి బయటపడేందుకు మీనా కూతురితో పాటు వెకేషన్ కి వెళ్లారు. ఈ టూర్ నుండి తిరిగొచ్చిన మీనామ‌ళ్లీ సినిమాల‌తో బిజీ కానుంద‌ట‌. ఇప్ప‌టికీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌తో పాటు కొత్త సినిమాల‌కి సైన్ చేయ‌నుంద‌ట‌. మోహన్ లాల్ కి జంటగా దృశ్యం 3లో మీనా నటించనున్నారని సమాచారం . తెలుగు సినిమాల‌లో సైతం న‌టించేందుకు మీనా ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago